Home ఆర్టికల్స్ మంగళూరు దుర్ఘటనను జ్ఞప్తికి తెచ్చిన కేరళ విమాన ప్రమాదం

మంగళూరు దుర్ఘటనను జ్ఞప్తికి తెచ్చిన కేరళ విమాన ప్రమాదం

mangalore flight crash, air india flight crash, kerala flight crash, mangolore flight crash, mangalore tragedy, mangalore flight, flight crash

mangalore flight crash

నిన్న రాత్రి(శుక్రువారం)  కేరళలో జరిగిన విమాన ప్రమాదం 2010 మే నెల 22న మంగళూరులో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదాన్ని జ్ఞప్తికి తీసుకొచ్చింది. అయితే నాటి ప్రమాదంలో 160 మంది ప్రయాణీకులు, సిబ్బంది దుర్మరణం చెందారు. దుబాయ్ నుంచి మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన విమానం ల్యాండ్ అవుతున్న సమయంలోనే కూలిపోయింది. ఈ ప్రమాదం నుంచి 8 మంది ప్రయాణీకులు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాదానికి గురైన వెంటనే వారు బయటకు దూకేయడంతో ప్రాణాలతో బయటపడినట్లు తెలుస్తోంది.

దేశ పౌర విమానయాన చరిత్రలోనే అతిపెద్ద ప్రమాద ఘటనల్లో ఒకటిగా మంగళూరు విమాన ప్రమాద ఘటన నిలుస్తోంది. ఇప్పుడు అదే విదంగా కోజికోడ్‌లో విమానాశ్రయంలో ల్యాండ్ అవుతూ ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్  విమానం కూలిపోవడం అందరినీ షాక్ కి గురిచేసింది. దశాబ్ధకాలం తర్వాత కేరళలో శుక్రువారం జరిగిన విమాన ప్రమాదం తీవ్రత అంతే ఉంది. దుబాయ్ నుంచి వచ్చిన విమానం ల్యాండింగ్ అవుతూ కూలిపోయింది. ప్రమాద సమయంలో అక్కడ భారీ వర్షం కురుస్తోంది. రన్‌వేపై నీరు ఉండటంతో విమానం స్కిడ్ అయినట్లు భావిస్తున్నారు. అయితే ప్రమాద తీవ్రతకు విమానం రెండు ముక్కలయ్యింది. అయితే కూలిపోయిన విమానం నుంచి మంటలు చలరేగకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో విమాన కెప్టెన్‌, ఇద్దరు ప్రయాణీకులు మృతి చెందగా 50 మందికి పైగా గాయపడ్డారు. వీరిని స్థానిక ఆస్పత్రులకు తరలించి చికిత్స కల్పిస్తున్నారు.

ఇది కూడా చదవండి: 

Exit mobile version