Monday, April 19, 2021

Latest Posts

ఇండియన్ ఆల్ టైమ్ బెస్ట్ డైరెక్టర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు

అద్భుత దృశ్య కావ్యాలకు కేరాఫ్ అడ్రస్‌ మణిరత్నం. ఆయన సినిమా ఓ మ్యాజిక్‌. ప్రేక్షకులను కళ్లార్పకుండా చూసేలా చేయగలిగే మంత్ర దండమేదో ఆయన చేతిలో ఉంది. అందుకే ఆయన తీసిన సినిమాలు తక్కువే అయినా, దాదాపు అన్నీ బాక్సాఫీస్‌ వద్ద క్లాసిక్‌లుగా మిగిలాయి.

తమిళ ఇండస్ట్రీలో లెజెండరీ దర్శకుడిగా పేరొందిన మణిరత్నం ఎప్పుడైతే గీతాంజలి చిత్రాన్ని తెరకెక్కించారో ఆ నిమిషం నుండి అతని పేరు తెలుగు ఇండస్ట్రీలో మారుమోగింది. గీతాంజలి సినిమాలో… ఒక అమ్మాయి తన ప్రాణాలని త్వరలోనే కోల్పోతున్నానని తెలిసి కూడా ప్రకృతిలోని ఆనందాన్ని ఆస్వాదిస్తూ తన ప్రతి క్షణాన్ని ఎంతో అద్భుతంగా గడుపుతుంది. అలా తన సినిమాను తెరకెక్కించాడు.

సిల్వర్ స్క్రీన్ను కాన్వాస్ చేసుకుని పెయింటింగ్స్ గీసిన నాయకుడు. తన దృశ్య కావ్యాలతో మౌనరాగాలు ఆలపించి..  భారతీయుల గుండెల్లో రోజా పూలు పూయించిన దళపతి. డైరెక్టర్ గా ఇండియన్ సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిన దర్శక దిగ్గజం. ఆయనే వన్ అండ్ ఓన్లీ మణిరత్నం. నేడు మణిరత్నం బర్త్ డే.

మణిరత్నం సినిమా తీస్తే అదో దృశ్య కావ్యంగా నిలవాల్సిందే. తన సినిమా స్టోరీ లైన్లో తేడా వచ్చినా.. దాన్ని తెరకెక్కించడంలో రాజీ పడని మనస్తత్వం మణిరత్నానిది. మణిరత్నం సినిమా అంటే ఇప్పటికీ హెవీ ఎక్స్ పెక్టేషన్స్ ఉంటాయి. ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి యూత్ వరకూ సేమ్ ఇంట్రస్ట్. 1956 జూన్ 2న చెన్నైలో జన్మించారు మణిరత్నం. తండ్రి ప్రఖ్యాత నిర్మాత కావడంతో ఆటోమేటిక్ గా మణిరత్నం అడుగులు దర్శకత్వం వైపు మళ్లాయి. మణి దర్శకత్వం వహించిన తొలి చిత్రం పల్లవి అనుపల్లవి అనే కన్నడ చిత్రం. కంటెంట్ పరంగా ఈ మూవీ బాగున్నా కమిర్షియల్ గా సక్సెస్ కాలేదు. ఈ సినిమా తరువాత రత్నం తీసిన రెండు చిత్రాలు కూడా ఆశించినంత విజయాన్ని సాధించలేక పోయాయి. మౌనరాగం రిలీజ్ అయిన తర్వాత ఈ డైరెక్టర్.. టాలెంట్ ఏమిటో సినీ ప్రపంచానికి తెలిసింది.

నేను చెప్పేది అతిశయోక్తిగా అనిపించినా నాగార్జున కెరీర్లో అన్ని సినిమాలు ఒక ఎత్తు అయితే మరొక ఎత్తు గీతాంజలి సినిమా అని చెప్పుకోవచ్చు. ఇండియన్ సెల్యూలాయిడ్ మీద యూరోపియన్ స్టైలును మించిన సినిమాలు తీసి చూపాడు మణిరత్నం. దర్శకుడగా మణిరత్నం ఖ్యాతి ప్రపంచానికి తెలిసేలా చేసిన చిత్రం నాయకుడు. హాలీవుడ్ మాస్టర్ పీస్ గాడ్ ఫాదర్ స్పూర్తితో తీసిన ఈ చిత్రంలో.. ఆ సినిమా తాలుకూ ఛాయలెక్కడా కనిపించకుండా అడుగడుగునా తన దర్శక ప్రతిభను చాటాడు.

అంతేకాదు మణిరత్నం తీసిన ప్రేమకథా చిత్రాల్లో గీతాంజలి సినిమా గురించి మనం ఎక్కువగా చెప్పుకోవచ్చు. ఈ మూవీలో హీరో హీరోయిన్ల మధ్య సంబంధాలను హృదయానికి హత్తుకునేలా తెరకెక్కించాడు మణిరత్నం. మామూలు సినిమాలే కాకుండా.. చిన్నపిల్లల సినిమాలను కూడా తీయగలనని అంజలి సినిమాతో నిరూపించాడు. అలాగే మహాభారతంలో దుర్యోధన, కర్ణ పాత్రలను బేస్ చేసుకొని మణి తీసిన దళపతి బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఈ మూవీలో రజనీకాంత్, మమ్ముట్టి పాత్రలను మలిచిన తీరు ఆడియన్స్ ఇప్పటికి మరిచిపోలేదు.

రోజా సినిమాతో తన టాలెంట్ ను మరోసారి రుచి చూపించాడు మణిరత్నం. భార్యభర్తలు, దేశ సమస్య స్టోరీ లైన్ తో వచ్చిన సినిమా ఆ సేతు హిమాచలం అలరించింది. ఇద్దరు సినిమా విషయానికొస్తే ఎమ్జీఆర్, కరుణానిధి స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమా కమర్షియల్ ఫెయిల్ అయిన వివమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. అలా రోజా నుంచి మొదలైన మణిరత్నం హవా సఖి, రావణ్ వరకూ అనేక మలుపులు తీసుకుంది. అద్భుతమైన క్లాసిక్స్ ఇచ్చిన మణిరత్నం మెసేజ్ ఓరియంటెడ్ మూవీలకు షిఫ్ట్ అయి అమృత, యువ లాంటి సినిమాలను తెరకెక్కించాడు.

ఆ తర్వాత వరుస ఫ్లాపులతో సతమతమయిన మణిరత్నం తమిళ్‌లో తెరకెక్కించిన కాదల్ కణ్మణి సక్సెస్‌తో మణిరత్నం ఈజ్ బ్యాక్ అనిపించాడు. ఈ చిత్రాన్ని తెలుగులో ఓకే బంగారంతో పేరుతో డబ్ చేస్తే ఇక్కడ కూడా మంచి సక్సెస్ అందుకుంది. దాని తర్వాత నవాబ్ తో తనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించి తన సత్తా చాటాడు. అలా తన కెరీర్ లో తీసినవి కొన్ని సినిమాలే అయినా అభిమానుల ఆప్యాయతను, అభిమానాన్ని చూరగొన డంలో మాత్రం ఒక మెట్టు పైనే ఉన్నాడు. ఇలా నే తన సినీ కెరీర్ లో ఇంకా ఎన్నో మంచి హిట్ సినిమాలను తీయాలని కోరుకుంటూ ఆయను మరోసారి ఆయనకు మన 99 చానెల్ తరుపునుంచి పుట్టిన రోజు శుభాకాంక్షలు.

ఇది కూడా చదవండి: 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss