Tuesday, March 2, 2021

Latest Posts

దయాగుణం చాటుకున్న హీరో మంచు మనోజ్

హీరో మంచు మనోజ్ నిన్న పుట్టిన రోజు సంధర్భంగా ఒక మంచి పనిని తలపెట్టారు. ఎక్కడెక్కడికో వెళ్లాల్సిన వలస కూలీలు మన తెలుగు రాష్ట్రాల్లో చిక్కుకుని ఉన్నారు. వారందరినీ వారి వారి ఇంటికి సురక్షితంగా చేర్చేందుకు మనోజ్ కొన్ని ఎన్‌జి‌ఓల సహాయంతో కొన్ని బస్ లను తీసుకుని వారిని భోజనం, సానిటైజర్ మరియు మాస్కూలు ఇస్తూ వారి గమ్యానికి సురక్షితంగా చేరుస్తుండటం అభినందించదగ్గ విషయం.

నిన్నటి నుంచి ప్రారంభమయిన ఈ సేవ కార్యక్రమం నా పుట్టిన రోజున ప్రారంభించి ఇలా పది మందికి సహాయమ చెయ్యడం నిజమైన పండుగ అని మంచు మనోజ్ తెలిపారు. ఇన్ని రోజులు మన బిల్డింగ్ లు కట్టడానికి వలస కూలీలను, రెస్టారెంట్ లో వంట చెయ్యడానికి వంట వాళ్ళను, వడ్డించడానికి సర్వర్లను వాడుకున్న మనం వారికి కష్ట కాలంలో తోడుగా ఉందాము, సహాయం చెయ్యని వాళ్ళు సహాయాన్నందివ్వండి అని విన్నవించారు మంచు మనోజ్.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss