Thursday, December 2, 2021

Latest Posts

ట్రైనీ ఎస్ఐపై లైంగిక వేధింపులు కేసులో మరిపెడ ఎస్ఐ సస్పెండ్

Maripeda SI Suspend

మహబూబాబాద్ జిల్లా మరిపెడ ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి పై సస్పెన్షన్ వేటు పడింది. శ్రీనివాస్ రెడ్డి ని సస్పెన్షన్ చేస్తున్నట్లు మహబూబాబాద్ ఎస్పీ కోటి రెడ్డి అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. కొన్ని రోజుల క్రితం మరిపెడ ఎస్ఐ తనపై అత్యాచారం చేసారంటూ, రాత్రి స్టేషన్ సమీపంలో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి తనపై లైంగిక దాడి చేశాడని వరంగల్ సీపీ తరుణ్ జోష్ కు ఫిర్యాదు చేసి ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డిపై చర్యలు తెసుకోవాలని డిమాండ్ చేశారు. తమకు న్యాయం జరగకపోతే ఉద్యోగానికి రాజీనామా చేస్తానంటూ వాపోయారు. దాంతో సత్వర విచారణకు ఆదేశించదాంతో, మహిళా ట్రైనీ ఎస్ఐపై ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఐజీ నాగిరెడ్డికి ప్రాథమిక నివేదిక చేరడంతో నివేదిక పరిశీలించిన తర్వాత ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలివ్వాలని ఐజీ నాగిరెడ్డి మహబూబాబాద్ ఎస్పీ కోటి రెడ్డిని ఆదేశించారు. ఐజీ ఆదేశాల మేరకు శ్రీనివాస్ రెడ్డిని సస్పెండ్ చేశారు.

ఇది కూడా చదవండి:  

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss