Tuesday, January 25, 2022

Latest Posts

టోక్యో ఒలింపిక్స్ నుంచి మేరీ కోమ్ నిష్క్రమణ

Mary Kom Olympics 2021

టోక్యో ఒలింపిక్స్ 2020లో బాక్సింగ్ ఛాంపియన్ మేరీ కోమ్ పై భారత్ చాలా ఆశలు పెట్టుకుంది. ఆమె ఖచ్చితంగా పతకంతో దేశానికి తిరిగి వస్తుందని చాలా మంది భావించారు. అయితే అనూహ్య రీతిలో మేరీ కోమ్ రౌండ్ ఆఫ్ 16 లో ఓడిపోయి ఒలింపిక్స్ నుండి నిష్క్రమించింది.

ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన మేరీ కోమ్, కొలంబియాకు చెందిన ఇంగ్రిట్ లోరెనా వాలెన్సియాతో రౌండ్ ఆఫ్ 16లో తలపడింది. అయితే మొదటి రెండు రౌండ్లలో గట్టి పోటీ ఇచ్చిన మేరీ కోమ్ చివరికి 3-2 పాయింట్లతో ఇంగ్రిట్ లోరెనా చేతిలో పరాజయం పాలయ్యింది. మేరీ కోమ్‌కు ఇప్పుడు 38 సంవత్సరాలు, బహుశా ఇదే ఆమెకు చివరి ఒలింపిక్స్ కావచ్చు.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss