తమిళ సూపర్ స్టార్ విజయ్, విజయ్ సేతుపతి, మాళవిక మోహన్ ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం మాస్టర్. ఈ మాస్టర్ భారీ అంచనాలతో ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకి వచ్చింది. కానీ ఈ చిత్రం విడుదల అయ్యిన కొద్ది గంటల్లోనే నెగిటివ్ టాక్ ని తెచ్చుకుంది. తమిళనాడులో విజయ్, విజయ్ సేతుపతి లకి ఉన్న ఇమేజ్ తో బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం వుంది. కానీ తెలుగు వెర్షన్ విడుదల రోజే పరమ చెత్త సినిమా అనే టాక్ వచ్చింది. అయితే ప్రస్తుతం దాదాపు బ్రేక్ ఈవెన్ దగ్గరలో వుంది.
ఎటొచ్చి హిందీ వెర్షన్ అభాసు పాలైంది. హిందీ వెర్షన్ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 12 కోట్లు కలెక్ట్ చెయ్యాల్సి వుంది. అయితే అది సాధ్యమయ్యే అవకాశాలు దరిదాపుల్లో కనిపించటం లేదు. సోషల్ మీడియా లో సెటైర్లు మీమ్స్ బాగా వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ ట్రేడ్ ఎక్స్పర్ట్స్ సైతం కరెంట్ ఖర్చులు కూడా రికవరీ అవ్వట్లేదు అంటూ సెటైర్లు వేస్తున్నారు. మొత్తంగా ఈ చిత్రానికి కేవలం 4 లక్షలు మాత్రమే వచ్చినట్టు ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు.
Film #Master is disaster in Hindi circuit as expected. Film collected approx ₹4 Lakhs on day1! This amount is not equal to electricity bill of the theatres forget staff salary and expenses.
— KRK (@kamaalrkhan) January 15, 2021
ఇవి కూడా చదవండి: