Master Pre Release Business
తమిళ్ స్టార్ హీరో విజయ్ తాజా చిత్రం మాస్టర్ మరో రేండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. అయితే ఈ సినిమా నిర్మాణానికి 125 కోట్లు ఖర్చు అయినట్టు సమాచారం. ఇందులో హీరోయిన్లుగా మాళవిక మోహనన్, ఆండ్రియా జెరెమియా నటించారు.
ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే తమిళనాడు థియేటర్ హక్కుల నిమిత్తం 70 కోట్లు, శాటిలైట్ హక్కుల నిమిత్తం 30 కోట్లు, డిజిటల్ 25 కోట్లు, ఓటిటి 20 కోట్లు, ఆడియో ఇతరత్రా కలిపి ఒక 5 కోట్లు వెరసి దాదాపుగా తమిళ వెర్షన్ బిజినెస్ తో ఈ సినిమా అప్పుడే కళ్ళు చెదిరే రీతిలో బ్రేక్ ఈవెన్ చేసింది.
ఇక తెలుగు వెర్షన్ కోసం ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ ఏకంగా 9 కోట్లు చెల్లించింది. కేరళలో కూడా విజయ్ ఫాలోయింగ్ దృష్ట్యా 7 కోట్ల బిజినెస్ చేసింది ఈ చిత్రం. ఇక ఇండియా వైడ్, ఓవర్సీస్ బిజినెస్ లెక్కలు తెలియాల్సి ఉంది. ఇవన్నీ చూస్తే దాదాపుగా 200 కోట్లకు పైగానే విజయ్ మాస్టర్ బిజినెస్ చేసింది.
మాస్టర్ సినిమా విడుదల విషయానికి వస్తే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా దాదాపు 2400 థియేటర్స్ లో విడుదలవుతుంది. కర్ణాటకలో 100 , కేరళలో 200 , ఏపీ తెలంగాణ లలో 400, తమిళనాడులో 700 థియేటర్స్ లో విడుదలవుతోంది. మిగతా రాష్ట్రాలన్నీ కలిపి 1000 థియేటర్స్ లో విడుదలవుతుంది మాస్టర్.
ఇవి కూడా చదవండి: