Sunday, June 20, 2021

Latest Posts

నితిన్ పుట్టిన రోజు స్పెషల్ పోస్టర్

Mastero Team Wishing Nithin Happy Birthday

నితిన్ యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ మాస్ట్రో చిత్రంలో అతని పాత్రపై చాలా సందేహాలను రేకెత్తించింది. అతను గుడ్డిగా నటించినప్పటికీ, పోస్టర్‌లో అతని హావభావాలను బయటపెట్టే విధంగా ఉంది. అలానే నితిన్ యొక్క పుట్టినరోజుకు ప్రత్యేకంగా శుభాకాంక్షలను అందించడానికి చిత్రబృందం మరొక పోస్టర్ను విడుదల చేసింది.

మాస్ట్రో మొదటి గ్లింప్స్ ఈ రోజు సాయంత్రం 4:05 గంటలకు విడుదల చేయనున్నట్లు ఈ పోస్టర్ లో   తెలిపారు. అయితే ఈ పోస్టర్ లో నితిన్ ఒక హత్యకు ప్రత్యక్ష సాక్షి అవుతున్నట్లుగా కనిపిస్తుంది. అయితే నితిన్ ఈ సినిమాలో గుడ్డివాడు కాబట్టి, మనం అతన్ని ప్రత్యక్ష సాక్షి అని పిలవగలమా లేదా అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

మాస్ట్రో క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతుంది, ఇందులో నభా నటేష్ హీరోయిన్ గా కనిపించనుంది. శ్రీలత మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మెర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. అలానే ఈ చిత్రంలో బాహుబలి నటి తమన్నా భాటియా ఒక విలక్షణమైన పాత్రను పోషిస్తోంది. ఇక పోతే ఈ సినిమా విడుదల తేదీని కూడా అప్పుడే ప్రకటించేసింది చిత్ర బృందం. ఈ సినిమా జూన్ 11 న విడుదల కాబోతున్నట్లు చెప్పేసింది.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss