Meat Shops Seized In Hyderabad For Violating Breakdown Rules
హైదరాబాద్ నగరంలోని పలు మటన్ షాపులపై జిహెచ్ఎంసి అధికారులు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశాల మేరకు శనివారం దాడులు నిర్వహించారు. దాడులలో కొన్ని దుకాణాలు కల్తీ మాంసం అమ్ముతునట్లు తెలుసుకున్న అదికారులు యజమానులను హెచ్చరించారు. కల్తీ మాంసం అమ్మితే జైలు పాలవుతారని వార్నింగ్ ఇచ్చారు.మొత్తం 62 షాపులపై దాడులు నిర్వహిస్తే వాటిలో 52 షాపులకు కనీసం లైసెన్సులు కూడా లేవని అధికారులు గుర్తించారు. వీటిలో అధిక ధరలకు మటన్ అమ్ముతునట్లు గుర్తించిన అదికారులు ఆయా షాప్ యజమానులపై కేసులు నమోదు చేశారు.
కిలో మాంసం 700 రూపాయల కంటే ఎక్కువగా విక్రయిస్తే చర్యలు తప్పవని మటన్ షాప్ యజమానులను ఆదేశించారు. రూ 700 కంటే ఎక్కువ అమ్మితే వారిపై కఠిన చర్యాలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. అలాగే కరోన వ్యాప్తి దృష్ట్యా షాపులో కూడా భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేయాలని ముఖ్యంగా ఆదివారాలు రద్దీ ఎక్కువ ఉండే ఆవకాశం ఉండడంతో దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని మటన్ షాప్ యజమానులకు అధికారులు సూచించారు. నిబంధనలను ఉల్లంఘిస్తే జైలుకు పంపుతామని వార్నింగ్ ఇచ్చారు.