Tuesday, January 25, 2022

Latest Posts

సిద్దిపేట మెడికల్ కాలేజీలో డాక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

సిద్దిపేట మెడికల్ కాలేజీలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న సీనియర్, జూనియర్ రెసిడెంట్ డాక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత గల అభ్యర్థులు  ఆన్‌లైన్‌లో దరఖాస్తుచేయాలని సూచించారు. ఈనోటిఫికేషన్ ద్వారా జనరల్ మెడిసిన్, టీబీసీడీ, జనరల్ సర్జరీ, అనెస్థీషియా, ఓబీజీ విభాగాల్లోని 29 పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులను ఇంటర్వ్యూ ద్వారా ఎంపికచేస్తారు. సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీ అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తులు అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు. ఈపోస్టులను ఏడాది కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేస్తారు.

మొత్తం పోస్టులు: 29

ఇందులో జూనియర్ రెసిడెంట్స్‌-16, సీనియర్ రెసిడెంట్స్‌-13 (జనరల్ మెడిసిన్-4, టీబీసీడీ-1, జనరల్ సర్జరీ-4, అనెస్థీషియా-2, ఓబీజీ-2)

అర్హత: జూనియర్ రెసిడెంట్లకు ఎంబీబీఎస్ పూర్తిచేసి ఉండాలి. సీనియర్ రెసిడెంట్లకు సంబంధిత స్పెషాలిటీలో ఎండీ లేదా ఎమ్మెస్ చేసి ఉండాలి. 40 ఏండ్ల లోపువారై ఉండాలి.

వేతనం: జూనియర్ రెసిడెంట్లకు రూ.36,200, సీనియర్ రెసిడెంట్లకు రూ.70 వేలు కన్సాలిడేటెడ్ రెమ్యూనరేషన్

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా

ఇంటర్వ్యూ తేదీ: అక్టోబర్ 14

వెబ్‌సైట్‌: http://www.gmcsiddipet.org/

ఇది కూడా చదవండి:

 

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss