Sunday, June 20, 2021

Latest Posts

పవన్ కళ్యాణ్ హీరోయిన్ మీరా చోప్రా ఆవేదన

Meera Chopra About Corona
కరోనా దేశంలో విలయతాండవం చేస్తోంది. సెకండ్ వేవ్ వేలాది మంది ప్రాణాలను పొట్టనపెట్టుకుంటోంది. రోజు 3 లక్షలకు పైగా కేసులు మరియు వేళల్లో మరణాలు సంభవిస్తున్నాయి. చాలా మంది ఆక్సీజన్ అందక.. ఆసుపత్రుల్లో బెడ్స్ లభించక ప్రాణాలు వదులుతున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ తో హీరోయిన్ గా నటించిన మీరా చోప్రా కజిన్స్ ఇద్దరు మృతి చెందారు.

ఆ విషయమై మీరా చోప్రా స్పందిస్తూ చాలా ఎమోషనల్ అయ్యింది. సోషల్ మీడియాలో ఆమె తన కజిన్స్ మృతి విషయాన్ని షేర్ చేసింది. దాదాపు పది నెలల తర్వాత పరిస్థితులు కుదుట పడుతున్నాయని అనుకుంటున్న సమయంలో మళ్లీ అనూహ్యంగా సెకండ్ వేవ్ రూపంలో కరోనా ముంచుకొచ్చింది. తక్కువ సమయంలో ఇద్దరు కజిన్స్ ను కోల్పోయానని ఆమె తెలిపింది. వారిద్దరు కూడా కరోనాతో కాకుండా సరైన చికిత్స అందకపోవడం వల్ల మృతి చెందారంది.

ఆసుపత్రిలో బెడ్ దొరకక ఒకరు, ఆక్సీజన్ అందక మరొకరు మృతి చెందారని విచారం వ్యక్తం చేసింది. వారిద్దరు కూడా 40 ఏళ్ల వయస్సు మాత్రమేనని తెలిపింది. ఈ ఇద్దరి మృతి తర్వాత ఏ సమయంలో ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అనే ఆందోళన ఉంది. ఇలాంటి పరిస్థితులు ముందు ఎప్పుడు ఎదురు కాలేదు. లక్షలు ఖర్చు చేసినా కూడా ప్రాణాలు కాపాడుకోలేని పరిస్థితి దేశంలో నెలకొందని ఆమె తెలిపింది.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss