mega daughter niharika acharya movie character details
మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాపై భారీ అంచనాలే వున్నాయి. ఇకపోతే సైరా సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాకపోవడంతో ఈ సినిమా తో అయినా మంచి కమర్షియల్ బాక్సాఫీస్ హిట్టు కొట్టాలని మెగాస్టార్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. గతంలో ఎప్పుడు లేని విధంగా మెగాస్టార్ డిఫరెంట్ షేడ్స్ తో ఈ సినిమాలో కనిపించబోతున్నాడట. ఇకపోతే ఈ సినిమాలోని పాత్రలకు సంబంధించిన రూమర్స్ బాగా వైరల్ అవుతున్నాయి.
అయితే ఈ రూమర్స్ మీద చిత్ర యూనిట్ ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. నటీనటులు ఎవరో ఒకరు భయటపెడుతున్నారే తప్ప ప్రొడక్షన్ హౌజ్ గాని, దర్శకుడు కొరటాల శివ కానీ ఈ రూమర్స్ ని ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. అసలు మ్యాటర్ లోకి వెళ్తే ఆచార్య సినిమాలో రామ్ చరణ్ అలాగే నిహారిక స్పెషల్ క్యారెక్టర్స్ లో కనిపించబోతున్నట్లు టాక్ వస్తోన్న విషయం తెలిసిందే.
రామ్ చరణ్ ఎలా కనిపిస్తాడో తెలియదు గాని మెగా డాటర్ నిహారిక మాత్రం రామ్ చరణ్ కి సోదరిగా కనిపించనుందట. అంటే రియల్ లైఫ్ లో ఉన్నట్లుగా అల్లరి చెల్లిగానే కాకుండా ఆమె పాత్ర కొంత ఎమోషనల్ గా కూడా ఉంటుందని సమాచారం. ఇదివరకే సైరా సినిమాలో ఒక గిరిజన యువతిగా కనిపించిన నిహారిక మరోసారి పెదనాన్న, అన్నయ్యలతో స్క్రీన్ షేర్ చేసుకోనుంది. మరి ఆ పాత్ర ఎంతవరకు క్లిక్కవుతుందో వేచి చూడాలి.