mega daughter Niharika Konidela reveales acharya movie story
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో ఆచార్య’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సఘం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి ‘ఆచార్య’ అనే టైటిల్ ను పరిసీలిస్తుండగా.. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.ఇక ఈ సినిమా లో మరో సారి చిరంజీవి పక్కన కాజల్ జత కట్టనుంది. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో రాంచరణ్ అలాగే నిహారిక కూడా కీలక పాత్రలు పోషిస్తున్నట్టు ప్రచారం నడుస్తుంది.దీని పై నిహారిక తాజాగా క్లారిటీ ఇచ్చింది. అంతేకాదు ఏకంగా కథ, ట్విస్ట్ లతో సహా బయటపెట్టేసింది. ఇప్పుడు సోషల్ మీడియా లో ఈ టాపిక్ వైరల్ కాగా… ఇక నిహారిక చెప్పిన కథ ప్రకారం… గోవింద ఆచార్య(మెగాస్టార్) కంటే ముందే ఉద్యమం చేపట్టిన రాంచరణ్ ను కొందరు దుర్మార్గులు కుట్ర పన్ని రాంచరణ్ ను చంపేస్తారు. ఆ కథ మొత్తం గోవింద( మెగాస్టార్) కు వివరించే రాంచరణ్ సోదరి పాత్రలో నిహారిక కనిపిస్తుందట.
తరువాత వారి పై పగ తీర్చుకుని ఆ దుండగులను హతమారుస్తాడు గోవింద. ఇదే మెయిన్ పాయింట్ అని తెలుస్తుంది. ఇక ఈ చిత్రంలో మెగాస్టార్ ఫ్యాన్స్ ను మెప్పించే మాస్ ఎలెమెంట్స్ తో పాటు మంచి సామజిక అంశంతో కూడిన మెసేజ్ కూడా వుండేలా జాగ్రత్త పడ్డాడు డైరెక్టర్. అయితే చరణ్ పాత్రకి ఓ హీరోయిన్ కూడా ఉంటుందని ఆ పాత్రలో రష్మిక కనిపిస్తుందని టాక్ నడుస్తుంది. అయితే ఈ విషయం పై క్లారిటీ రావలసి వుంది.