Home సినిమా వార్తలు అల్లు అర్జున్ ని మెగాస్టార్ చేసిన ఆహా, ఫ్యాన్స్ ఆగ్రహం

అల్లు అర్జున్ ని మెగాస్టార్ చేసిన ఆహా, ఫ్యాన్స్ ఆగ్రహం

Mega Fans Fire on Aha For Calling Allu Arjun Mega Star

తెలుగు ఓటీటీ ఆహాని స్థాపించారు అల్లు అరవింద్. అయితే ఈ ”ఆహా” అనే ఓటీటీ వేదికను స్థాపించి దాని ద్వారా ఎంత ప్రచారం చేసుకోవాలో అంతా చేస్తున్నారు. ఇప్పుడీ ప్రచార కార్యక్రమం అల్లు అర్జున్ కు కూడా విస్తరింపజేశారు. అవును.. అల్లు అర్జున్ ను మెగాస్టార్ ను చేసేసింది ఆహా. ఆయన ఇక ఎంత మాత్రం స్టయిలిష్ స్టార్ కాదంట, ఆయనిప్పుడు మెగాస్టార్. తమ ఓటీటీని పైకి తీసుకొచ్చేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తోంది ఆహా.

ఇందులో భాగంగా సమంతతో ఇంటర్వ్యూలకు తెరదీశారు. ఆల్రెడీ చిరంజీవిని ఇంటర్వ్యూ చేశారు. ఇప్పుడు బన్నీని కూడా ఇంటర్వ్యూ చేశారు. అయితే ఈ ఎపిసోడ్ ప్రమోషన్ లో భాగంగా బన్నీని మెగాస్టార్ ను చేసేశారు. “మెగాస్టార్ అల్లు అర్జున్ స్పెషల్ ఎపిసోడ్” అంటూ సోషల్ మీడియాలో ‘ఆహా’ చేస్తున్న ‘అతి’ ప్రచారం ఇది. బన్నీకి స్టయిలిస్ స్టార్ అనే బిరుదు ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే కావాలనే ఆ ట్యాగ్ ను పక్కనపెట్టి, అల్లు అర్జున్ ను మెగాస్టార్ ను చేసేసింది ఆహా.

కావాలనే చేసినట్టు అనిపిస్తున్న ఈ పనిపై మెగా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. “సింహాసనంపై కూర్చునే అర్హత అక్కడ ఆ ఇంద్రుడిది, ఇక్కడ ఈ ఇంద్రసేనారెడ్డిది” అనే డైలాగ్ ను ట్రెండ్ చేస్తూ తమ కోపాన్ని పరోక్షంగా ప్రదర్శిస్తున్నారు. చిరంజీవి తర్వాత మెగాస్టార్ అయ్యే అర్హత రామ్ చరణ్ కు మాత్రమే ఉందంటూ కామెంట్స్ మొదలుపెట్టారు. అయితే కొద్దిసేపట్లోనే తన తప్పును సరిదిద్దుకుంది ఆహా. సమంత-బన్నీ ఇంటర్వ్యూ ప్రోమోల నుంచి మెగాస్టార్ అనే పదాన్ని తొలిగించింది. అయినప్పటికీ ఫ్యాన్స్ మాత్రం విపరీతంగా ట్రాల్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

Exit mobile version