The mega heroes follows R Narayana Murthy
విప్లవ సినిమాలు ఇంతక ముందు వచ్చినంతగా ఇప్పుడు రావడం లేదు, కాగా ఇప్పుడు లైన్ లో ఉన్న ప్రొజెక్ట్స్ అన్నీ ఈ విప్లవ నేపద్యం ఉన్న సినిమాలు కావడం విశేషం. ఈ తరం హీరోలలో మొట్టమొదటగా ఎర్రతుండు కత్తి విప్లవ పాత్ర చేసిన స్టార్ మాత్రం పవర్ స్టార్ట్ పవన్ కల్యాణ్, అవునండీ జల్సా సినిమాలో త్రివిక్రమ్ డైరక్షన్ లో పవన్ కల్యాణ్ నటించిన నక్సలైట్ పాత్ర అందరినీ ఎంతో భావోద్వేగాలకు గురి చేశాయి. తాజాగా క్రిష్ దర్శ్కత్వంలో పవన్ కల్యాణ్ నటించబోయే సినిమా కూడా ఇదే తరహా విప్లవ వీరుడిగా కనిపించబోతున్నారు పవన్ కల్యాణ్.
పవన్ కల్యాణ్ మాత్రమే కాదు, మెగా స్టార్ చిరంజీవి సినిమా ఆచార్యలో చిన్నప్పటి పాత్ర ఇదే తరహా బావోద్వేగ విప్లవ కధ, ఈ కారెక్టర్ ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చెయ్యడం వేశేషం. అయితే వెనుకబడిన తెగలకు చెందిన లారీ డ్రైవరు పాత్రలో “పుష్పా” గా మన ముందుకు రాబోతున్నాడు అల్లు అర్జున్, ఈ సినిమాను డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఒకే సారి మెగా హీరోలందరు విప్లవ సినిమాలు తియ్యడం ఇదే మొదటి సారి. కాగా వీళ్ళంతా ఇప్పుడు ఆర్ నారాయణ మూర్తి ని ఫాలో అవుతున్నారా అన్న ఆశ్చర్యం కలుగుతుంది.