Mega Nephew Sai Dharam Tej marriage proposal
దేనికైనా సమయం రావాలని అంటారు. పెళ్ళికి కూడా టైం రావాల్సిందే. అందునా థర్టీ ప్లస్ వచ్చేసాక ముందే పెళ్ళికి సిద్ధపడిపోవాలి. అందరూ అడుగుతూనే ఉంటారు. సరిగ్గా ఇప్పుడు టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్స్‌లో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా పెళ్లి జాబితాలో ముందున్నాడు. ఇప్పటికే మెగా కుటుంబంలో రామ్ చరణ్, బన్నీ ల పెళ్లిళ్లు అయిపోయాయి. ఇక క్యూలో సాయి ఉన్నాడు. ఆ తర్వాత వరసలో వరుణ్ తేజ్ ఉన్నాడు. అయితే తనకు ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్ధేశ్యమే లేదని వరుణ్ ఇప్పటికే తేల్చేసాడు.
మరోవైపు సాయి ధరమ్ తేజ్ అయితే ఇప్పటికే సాయి నటించిన సోలో బ్రతుకే సో బెటరూ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. కొత్త దర్శకుడు సుబ్బు దీన్ని తెరకెక్కించాడు. మరోవైపు దేవా కట్టాతో పాటు మరో రెండు సినిమాలకు కూడా ఈయన కమిట్మెంట్ ఇచ్చేసాడు. లాక్డౌన్ గురించి సాయి ప్రస్తావిస్తూ, స్కూల్ డేస్ తర్వాత ఇన్ని రోజులు ఇంటి దగ్గరే ఉండటం ఇదే ఫస్ట్ టైమ్ అన్నాడు. లాక్డౌన్ బోర్ అనిపించినా కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది తప్పదన్నాడు.
తనకు పెళ్లి వయసు వచ్చి వెళ్లిపోతుందని.. అప్పుడే 33 ఏళ్లు వచ్చేశాయని తనమీద తానే సెటైర్ వేసుకున్నాడు. పెళ్లి చేసుకోమని ఇంట్లో వాళ్లు ఒకటే గొడవ చేస్తున్నారని సాయి అంటున్నాడు. ఈదశలో పెళ్లి వద్దని ఇంటి నుంచి పారిపోవడం కూడా కష్టమేనని తేల్చేసాడు. అన్నీ కాల్సివస్తే, ఈ ఏడాదే పెళ్లి బాజాలు మోగుతాయని కూడా చెప్పాడు. ఇప్పటికే అమ్మా వాళ్లు కూడా అమ్మాయిని వెతికే పనిలో ఉన్నారని కన్ఫర్మ్ చేసాడు. అదృష్టం కలిసొస్తే ఈ ఏడాది ప్రేమలో పడతానేమోనని సరదా వ్యాఖ్యలు కూడా చేశాడు.