Wednesday, April 21, 2021

Latest Posts

మెగాస్టార్ తో సూపర్ స్టారా,స్టైలిష్ స్టారా

Megastar 152 Movie

తొమ్మిదేళ్ల రాజకీయాల తర్వాత  ‘ఖైదీ నంబర్ 150’తో గ్రాండ్ గా రీ-ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్  చిరంజీవి ఆతర్వాత 151మూవీగా  హిస్టారికల్ మూవీ  ‘సైరా నరసింహారెడ్డి’తో అలరించాడు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తన 152వ సినిమా చేస్తున్నాడు. ఇందులో చిరుతో పాటు మరో హీరోకి కూడా స్థానముందని, అందులో రామ్ చరణ్ నటిస్తాడని మొదట్లో జోరుగానే  ప్రచారం సాగింది.  అయితే, రాజమౌళి మల్టీస్టారర్ `ఆర్ఆర్ఆర్‌’ డీలే కావడం అది పూర్తయ్యే వరకు మరో సినిమా చేయనని జక్కన్నకి చరణ్ మాటివ్వడంతో ఆలోచనలో పడ్డాడట.  

ఇక  ‘చిరు 152’ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగస్టులో రిలీజ్ చేయాలని డిసైడ్ అవడంతో చరణ్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడట.  ‘చిరు 152‘ని నిరంజన్ రెడ్డితో కలసి నిర్మిస్తున్నాడు చరణ్. అందుకే తను చేయాలనుకున్న నక్సలైట్ పాత్రలో మరో స్టార్‌ని నటింపజేసే ప్రయత్నం చేస్తున్నాడట.  అయితే, ఇప్పుడదే పాత్ర కోసం ఇద్దరు స్టార్ల పేర్లు పరిశీలనలోకి తీసుకున్నారని టాక్ నడుస్తోంది.

ఇది కూడా చూడండి :కాజల్ మోసగాళ్ళు మూవీ ఫస్ట్ లుక్

 ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో రెండు సినిమాల్లో నటించిన మహేశ్ బాబుతో గానీ లేదంటే మరో మెగా కాంపౌండ్ హీరో అల్లు అర్జున్‌తో గానీ ఈ పాత్ర చేయించే ప్రయత్నం చెర్రీ చేస్తున్నాడట.  ఈ ఇద్దరిలో ఎవరు ‘చిరు 152’లో నటించడానికి ముందుకి వస్తారా ఒకవేళ  వీలు కుదుర్చుకుని చెర్రీయే  నటిస్తాడో వేచి చూడాలి.  

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss