సూపర్ స్టార్ మహేష్ బాబుతో యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి సరిలేరు నీకెవ్వరు మూవీ చేస్తున్నాడు. అనిల్ సుంకర,దిల్ రాజు కల్సి ఈ మూవీ నిర్మించారు. సుదీర్ఘ విరామం తరువాత లేడి అమితాబ్ విజయశాంతి రీ ఎంట్రీతో కీలక పాత్ర పోషిస్తోంది. రష్మిక మందన హీరోయిన్ గా చేస్తోంది. సంగీత,హరితేజ, బండ్ల గణేష్,ప్రకాష్ రాజ్,తదితరులు నటిస్తున్నారు. ఈ సంక్రాంతికి విడుదల కానున్న ఈ మూవీ షూటింగ్ ప్రారంభం నుంచి భారీ అంచనాలను క్రియేట్ చేస్తూ వస్తోంది.
దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ మూవీ అప్ డేట్స్ ఇస్తూ వచ్చారు. ఇక మూవీ ప్రమోషసరిలేరు నీకెవ్వరు మూవీన్స్ లో భాగంగా మెగాస్టార్ చిరంజీవి సాయాన్ని సూపర్ స్టార్ తీసుకున్నాడు. అందుకే ఈ మూవీ ట్రైలర్ ఆవిష్కరణకు మెగాస్టార్ విచ్చేసి,లాంచ్ చేసారు. దీంతో చిత్రబృందంలో సరికొత్త ఉత్సాహం నెలకొంది. ఇక ఈ మూవీ సాంగ్స్,టీజర్,ట్రైలర్ భారీ రెస్పాన్స్ వచ్చింది. సీరియస్ సినిమాలు చేస్తూ వస్తున్న మహేష్ ఈ మూవీలో అదరగొట్టే కామెడీ కూడా పండించాడట. ఈ మూవీలో డైరెక్టర్ ఫుల్ కామెడీ టచ్,పవర్ ఫుల్ ఎమోషన్ దట్టించాడట.
అయితే ఈ మూవీ ట్రైలర్ లాంచ్ కు చిరంజీవి రావడం వెనుక కారణాలు ఏమిటబ్బా అని ఆరా తీస్తే, అసలు విషయం బయటపడింది. దీనివెనుక మహేష్ బాబు సన్నిహితుడు,టాలీవుడ్ డైరెక్టర్ మెహర్ రమేష్ ఉన్నాడట. చిరంజీవికి బంధువైన మెహర్ రమేష్ అందరికన్నా ముందే వెళ్లి ఫంక్షన్ కి ఆహ్వానించారట. దీనికి మెగాస్టార్ ఒకే చెప్పడంతో చిత్రబృందం మర్యాదపూర్వకంగా కల్సిందట. ఈ వార్త తాజాగా వైరల్ అయింది. ఈ సినిమా ఇక సూపర్ డూపర్ హిట్ కొట్టాలని మెగాస్టార్ ఆకాంక్షించారు.