Megastar Chiranjeevi helps in conducting the operation of Ranjala Naga Laxmi
మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. చిరు సహాయంతో ఈ రోజు రాజనాల నాగలక్ష్మి గర్కి ఆపరేషన్ జరిగింది. ఈ మేరకు అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్ష్యులు రవణం స్వామినాయుడు ఆ ఆపరేషన్ వివరాలు చెబుతూ ఓ లేఖ విడుదల చేశారు.
చిరంజీవి గారి సహాయంతో ఈ రోజు రాజనాల నాగలక్ష్మి గారికి స్టార్ హాస్పిటలో ఆపరేషన్ విజయవంతంగా జరిగిందని చైర్మెన్ & మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఎమ్. గోపీచంద్ గారి ఆధ్వర్యంలో సుమారు 3.30 నిమిషాల పాటు జరిగిన ఆపరేషన్ విజయవంతం అయ్యినట్లు తెలిపారు. ఆవిడ గురించి ఎప్పటికప్పుడు చిరంజీవి గారు సమాచారం తెలుసుకుంటూనే వునట్లు చెప్పారు.
డాక్టర్ గోపీచంద్ గారికి ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ధన్యవాదలు తెలిపారు. అలాగే ఈ విషయాన్ని సమయానికి నా దృష్టికి తీసుకొచ్చిన స్వామి నాయుడికి, హైదరాబాద్ వరకూ రావటానికి ఏర్పాట్లు చేసిన బి. దిలీప్ గారికి, ఇంతదూరం ప్రయాణించడానికి అనుమతిచ్చిన రెండు రాష్ట్రాల పోలీసు అధికారులకి ఇతర సిబ్బందికి కూడా దాన్యవాదాలు తెలిపారు.