megastar chiranjeevi movies that stopped with the top directors
సినీ ఇండస్ట్రీ ఓ మాయా ప్రపంచం. ఎప్పుడు ఎవరి మధ్య విబేధాలు వస్తాయో,ఎవరి మధ్య సఖ్యత వస్తుందో, ఏ సినిమా ఆగిపోతుందో ఎవరూ చెప్పలేం. ఇదేదో చిన్న హీరోల విషయంలోనే కాదు అగ్ర హీరోల విషయంలో కూడా ఇలాంటి ఘటనలు ఉంటాయి. ఇక 1997లో మెగాస్టార్ చిరంజీవికి సంబంధించి అనుకోని రెండు సంఘటలను చూస్తే, ఔరా అనిపిస్తుంది. స్టార్ ప్రొడ్యూసర్ సి. అశ్వినీదత్ నిర్మాణంలో చిరంజీవి ,టబు జంటగా సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో సోషల్ ఫాంటసీ సినిమా స్టార్ట్ చేసారు. దాని పేరు భూలోక వీరుడు అని ఫిక్స్ చేసారు.
ఈ సినిమాకు సంబంధిచి ఒక యాక్షన్ సీన్,ఓ పాట షూట్ చేసారు. కానీ బడ్జెట్ ఒకటి అయితే ఖర్చు మరోలా కనిపించింది. అయితే ఒక పాటకి ,సీన్ కి చాలా ఖర్చయిపోయిందట. ఇలా ఐతే మూడు రెట్ల బడ్జెట్ కూడా చాలదన్న వాదన సింగీతం,అశ్వినీదత్ ల మధ్య జరిగి, చివరకు సినిమా మధ్యలోనే ఆగిపోయింది. సరే, దత్ గారు రామ్ గోపాల్ వర్మతో ఓ మూవీ ఉంది అది చేద్దాం అని చిరంజీవి అనడంతో వర్మ డైరెక్షన్ లో ఊర్మిళ హీరోయిన్ గా చిరు హీరోగా సినిమా స్టార్ట్ చేసారు. ఓ షెడ్యూల్ కూడా పూర్తిచేశారు. చిరు,ఊర్మిళపై ఓ సాంగ్ కూడా షూట్ చేసారు.
అయితే చిరు,వర్మల మధ్య క్రియేటివిటీ విషయంలో విబేధాలు రావడంతో అది కూడా ఆగిపోయింది. వర్మ ఎక్కడా రాజీ పడే మనస్తత్వం కాదని అందుకే మూవీ ఆగిపోయిందని అశ్వినీదత్ స్వయంగా చెప్పాడు. అయితే దత్తు గారికి ఇచ్చిన మాట ప్రకారం మూడో సినిమాగా చూడాలని ఉంది తీశారు. ఆగిపోయిన రెండు సినిమాల్లో చిత్రీకరించిన రెండు సాంగ్స్ ఇందులో యాడ్ చేసారు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ అయింది. ఆగిపోయిన రెండు సినిమాల నష్టం భర్తీ కూడా అయింది. ఇక ఆగిన రెండు సినిమాల్లోని పాటలను వినాలని వుంది పేరిట ఓ ఆడియో కేసెట్ కూడా అప్పట్లో రిలీజ్ చేసారు.