Megastar Chiranjeevi Said Sorry to Director Koratala Siva:
అవునా ,ఎందుకు ఇలాంటి ప్రశ్నలు రావడం సహజమే. కానీ మెగాస్టార్ చిరంజీవి నిజంగానే క్షమాపణ కోరారు. సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాక ఖైదీ నెంబర్150,తర్వాత సైరా మూవీస్ తో దుమ్మురేపిన చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఇటీవల సెట్స్‌పైకి వచ్చిన ఈ సినిమా టైటిల్‌ను దర్శకుడు ఇంతవరకూ రిలీజ్ చేయలేదు.
దీంతో చిరు సినిమా టైటిల్ గురించి సోషల్ మీడియాలో రచ్చ జరుగుతోంది. సినిమా పేరు ఏమై ఉంటుందా అని మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా దర్శకుడు శివ ఈ సినిమా టైటిల్‌ను సీక్రెట్‌గా ఉంచి అభిమానులకు థ్రిల్ ఇద్దామనుకుంటే.. చిరు నీళ్లు జల్లారు. నటుడు బ్రహ్మాజీ కొడుకు నటిస్తున్న ‘ఓ పిట్టకథ’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అదివారం జరిగింది.
ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన చిరు స్టేజీపై తన సినిమా గురించి మాట్లాడారు. ఇక మాటల మధ్యలో సినిమా టైటిల్ ‘ఆచార్య’ అని చెప్పేశాడు. ఇక అభిమానులకు తమ సినిమా టైటిల్ తెలిసిపోయిందని దర్శకుడు తలపట్టుకుంటున్నాడు. కాగా చిరు అనుకోకుండా టైటిల్ చెప్పడంతో ‘పాపం శివ ఈ టైటిల్ ని ప్రకటించడానికి ఓ ప్లాన్ చేసుకున్నాడు. కానీ ఇలా నా నోటివెంట వచ్చేసింది. సారీ శివ’అని చిరు చెప్పుకొచ్చారు