Home సినిమా వార్తలు మెగా సెల్యూట్ –  స్పందించిన పోలీస్ బాస్

మెగా సెల్యూట్ –  స్పందించిన పోలీస్ బాస్

Chiranjeevi Salutes Police

Megastar Chiranjeevi Salutes Police efforts in Telugu States

మ‌హ‌మ్మారి క‌రోనా కట్టడికి దేశంలో లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో   డాక్ట‌ర్స్‌, పోలీసులు, ఇత‌ర వైద్య సిబ్బంది, పారిశుద్య కార్మికులు ఎంత‌గానో కృషి చేస్తున్నారు. డాక్ట‌ర్స్ ఆసుపత్ర‌ల్లో ఉండి పోరాటం చేస్తుంటే,..  పోలీసు శాఖ‌వారు రోడ్ల‌పై ఉంటూ, ప్ర‌జ‌లు సామాజిక దూరం పాటించేలా, గుంపులుగా తిర‌గ‌కుండా ఉండేలా ప‌లు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. వారి ప్రాణాల‌నే కాకుండా వారి కుటుంబ స‌భ్యుల ప్రాణాల‌ను రిస్క్‌లో పెట్టి క‌ష్ట‌ప‌డుతున్న పోలీసు శాఖ‌వారి కృషిని అంద‌రూ శ్లాఘిస్తున్నారు.  ఇప్ప‌టికే మ‌హేశ్‌, చైత‌న్య పోలీసు శాఖ‌ను ట్విట్ట‌ర్ వేదిక‌గా అభినందిస్తూ,సెల్యూట్ చేసారు. ఇక  మెగాస్టార్ చిరంజీవి  తాజాగా  రెండు తెలుగు రాష్ట్రాల పోలీసుల‌ను అభినందిస్తూ ఓ  విడుద‌ల చేసిన వీడియో వైరల్ అయింది.

‘‘రెండు తెలుగు రాష్ట్రాల పోలీసుల పనితీరు అద్భుతం. నిద్రాహారాలు కూడా మాని వారు పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు. నేను హైదరాబాద్‌లో ఉండి స్వ‌యంగా చూశాను. పోలీసుల ప‌నితీరు వ‌ల్లే లాక్‌డౌన్ సక్సెస్‌ఫుల్ అయ్యింది. దాని వ‌ల్లే క‌రోనా విజృంభ‌ణ చాలా వ‌ర‌కు అదుపులో వ‌చ్చింది. నేను ఈ సంద‌ర్భంగా సామాన్య జ‌నాన్ని వేడుకునేది ఒక‌టే. ఈ క‌రోనాని అంత‌మొందించ‌డంలో పోలీసుల‌కు మ‌నం చేదోడు వాదోడుగా ఉండాలి. పోలీసు శాఖ వారు చేస్తున్న ఈ అమోఘ‌మైన ప్ర‌య‌త్నానికి పోలీసు బిడ్డ‌గా వారికి చేతులెత్తి సెల్యూట్ చేస్తున్నాను’’ అని మెగాస్టార్ పేర్కొన్నారు. కాగా ఈ  వీడియోపై తెలంగాణ డీజీపీ మహేంద‌ర్ రెడ్డి స్పందిస్తూ ‘‘మీరు మాకే కాదు.. పోలీసు శాఖవారందరికీ స్ఫూర్తినిచ్చారు. మీ నుండి స్ఫూర్తి పొందిన ప్రేక్షకులను కూడా మేల్కొలిపారు. పోలీసు కుటుంబంలో ఓ వ్యక్తిగా ఉన్న మీరు కోవిడ్‌పై మేం చేస్తున్న పోరాటానికి గొప్ప సాయాన్ని చేశారు. మీ మాట‌లు మ‌రింత మంది లాక్‌డౌన్‌ కి  క‌ట్టుబ‌డి ఉంటార‌ని ఆశిస్తున్నాం’’ అన్నారు

Exit mobile version