Monday, March 8, 2021

Latest Posts

కరోనాపై మెగాస్టార్ రెస్పాన్స్ – ఫాన్స్ ఫిదా

Megastar Chiranjeevi speaks about Corona Virus:

కరోనా వైరస్ మహమ్మారి పై మెగాస్టార్ చిరంజీవి మరోసారి రెస్పాండ్ అయ్యారు. దీంతో మెగా ఫాన్స్ ఫిదా అవుతున్నారు. తన సినిమా షూటింగ్‌ను నిలిపివేస్తూ.. కరోనా విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పిన ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి.. ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుందని కితాబిచ్చారు. అంతేకాదు, అందరూ ప్రభుత్వ నిర్ణయాలను పాటించి, షూటింగ్స్ ఆపేయాలని పిలుపునిచ్చారు. అయితే మరోసారి కరోనా విషయంలో జాగ్రత్తలు పాటించాలని పలు సూచనలు చేస్తూ ఓ వీడియో ద్వారా మెసేజ్‌ అందించారు. ఇది వైరల్ అయింది.

‘‘యావత్ ప్రపంచాన్ని భయాందోళనకి గురి చేస్తున్న సమస్య కరోనా. అయితే మనకేదో అయిపోతుందనే భయం కానీ, మనకేం కాదు అనే నిర్లక్ష్యం కానీ ఈ రెండూ పనికిరావు. జాగ్రత్తగా ఉండి ధైర్యంగా ఎదుర్కొవలసిన సమయం ఇది. జనసమూహానికి వీలైనంత వరకు దూరంగా ఉండండి. ఈ ఉధృతం తగ్గే వరకు ఇంటికే పరిమితం అవటం ఉత్తమం. మోచేతి వరకు వీలైనన్ని సార్లు సబ్బుతో సుమారు 20 సెకన్ల పాటు శుభ్రంగా కడుక్కోండి. తుమ్మినా, దగ్గినా కర్చీఫ్ వంటి వాటిని అడ్డం పెట్టుకోవడం, లేదా టిష్యూ పేపర్ అడ్డం పెట్టుకోవడం తప్పనిసరి. ఆ వాడిన టిష్యూ పేపర్ కూడా జాగ్రత్తగా మూత ఉన్న చెత్తబుట్టలో వేయండి’అంటూ మెగాస్టార్ సూచించారు.

‘మీ చేతిని కళ్ళకి, నోటికి, ముక్కుకి, ముఖానికి తగలకుండా చూసుకోండి. అలాగే మీకు జ్వరం, జలుబు, దగ్గు, అలసట వంటివి ఉంటే వెంటనే డాక్టర్‌ని సంప్రదించడం. మీ జలుబు, దగ్గు ఇతరులకి అంటకుండా మీ ముఖానికి మాస్క్ ధరించండి. ఈ జాగ్రత్తలన్నీ కాకపోయినా, నిర్లక్ష్యం చేస్తే మాత్రం మహమ్మారి అయ్యే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవలసిన బాధ్యత మనందరికీ ఉంది. ఎవరికీ షేక్ హ్యాండ్ ఇవ్వకుండా మన సంప్రదాయం ప్రకారం నమస్కారం చేద్దాం. అదే ఉత్తమం…’’ అని మెగాస్టార్ చిరంజీవి చెప్పుకొచ్చారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss