Megastar Chiranjeevi Tweet Gives Strong Counter To Puri Jagannadh
ప్రస్తుతం దేశమంతా కరోనా మహమ్మారి కారణంగా లాక్డౌన్ లో ఉంది. ఒక్క ఇండియా మాత్రమే కాదు చాలా దేశాలు లాక్ డౌన్ లోకి వెళ్లాయి. కరోనా మహమ్మారి అలాంటిది మరి. ఇక సినిమాల షూటింగ్స్ కూడా ఆగిపోయాయి. అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఇక ఉగాది సందర్బంగా సోషల్ మీడియాలోకి ఎంటర్ అయిన మెగాస్టార్ చిరంజీవి కి కింగ్ నాగార్జున తదితరులు స్వాగత పోస్టులు పెట్టారు.
అయితే తాజాగా చిరంజీవి పెట్టిన పోస్ట్ కలకలం రేపింది. కరోనా లాక్ డౌన్ తో డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ముంబై, బ్యాంకాక్ బీచ్‌లను బాగా మిస్సవుతుంటాడని మెగాస్టార్ చిరంజీవి ఇటీవల ట్వీట్ చేసాడు. ఈ ట్వీట్‌పై తాజాగా డైరెక్టర్ పూరీ జగన్నాథ్ స్పందించాడు.
`ఇలాంటి సమయంలో చిరంజీవి సర్ బ్యాంకాక్ గురించి ఎందుకు ట్వీట్ చేశారో తెలియదు గానీ, ఆ ట్వీట్ నా కొంప ముంచింది. మా ఆవిడ నా చెంప పగలగొట్టింది. చిరంజీవి సర్ ట్వీట్ చూసి మా ఆవిడకు గతంలో జరిగినవన్నీ గుర్తుకొచ్చి నా మీద చేయి చేసుకుంది’అని పూరీ సరదాగా వ్యాఖ్యానించాడు