Monday, May 10, 2021

Latest Posts

రజనీకాంత్ బాటలో మెగా స్టార్ చిరంజీవి

Megastar follows Rajnikanth Trend :

సైరా నరసింహ రెడ్డి సినిమా తర్వాత ఆచార్య సినిమాతో రాబోతున్న చిరంజీవి తన తదుపరి చిత్రాలు దర్శకులను ఖరారు చేసినట్టు సమాచారం. కాగా తమిళ్ సూపర్ స్టార్ట్ రజనీకాంత్ గత నాలుగేళ్లుగా కొత్త దర్శకులతోనే చేస్తున్నారు, ఇదే బాటలో మెగా స్టార్ చిరంజీవి నెక్స్ట్ సినిమాలను యంగ్ దర్శకులకు ఇవ్వనున్నారు. రజనీకాంత్ ప్రస్తుతం గోపీచంద్ తో శంఖం, సౌర్యం సినిమాలు తీసిన శివ దర్శకత్వంలో నటిస్తున్నారు. తలైవా గత చిత్రాల దర్శకులను చూస్తుంటే యంగ్ డైరెక్టర్స్ కు ఛాన్సులు ఇస్తున్నారు. పెద్దగా క్రేజ్ లేని రంజిత్ దర్శకత్వంలో వరుస పెట్టి కబాలి, కాల సినిమాలు చేశారు.

తమిళ ఇండస్ట్రీలో ఒకటి రెండు సినిమాల చేసిన దర్శకులను ఎంచుకోవడం రజనీకాంత్ కబాలి సినిమాతో మొదలుపెట్టారు. పిజ్జా, జిగర్తాండ వంటి చిత్రాలను తీసిన కార్తీక్ సుబ్బరాజుకు ఛాన్స్ ఇచ్చి పేట మూవీ తో హిట్ కొట్టారు. ప్రస్తుతం అజిత్ ఆస్థాన దర్శకుడు శివ దర్శకత్వంలో నటిస్తున్నారు. యంగ్ డైరెక్టర్స్న్ ఎంచుకోవాలన్న ఆలోచన సీనియర్ హీరోల్లో పెరుగుతుంది. రజనీకాంత్ దారిలోనే నడుస్తూ యంగ్ డైరెక్టర్స్ ని ఎంచుకుంటున్నాడు చిరంజీవి. జై లవ కుశ ఫేమ్ బాబీ, మెహెర్ రమేష్ కు ఛాన్స్ ఇచ్చాడు.ఇద్దరు నచ్చే స్క్రిప్ట్స్ తో వస్తే మూవీ పట్టాలెక్కే అవకాశముంది.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss