Saturday, January 16, 2021

Latest Posts

వైర్ లెస్ చార్జింగ్ తో రానున్న ఎంఐ 10 స్మార్ట్ ఫోన్ రిలీజ్ డేట్ ఫిక్స్..!!

MI 10 Smartphone Release Date Fix

భారతదేశ నంబర్ వన్ బ్రాండ్ షియోమీ తన ప్రతిష్టాత్మకమైన ఎంఐ 10 స్మార్ట్ ఫోన్ ను భారత్ లో మే 8వ తేదీన లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ మార్చి 31వ తేదీనే లాంచ్ కావాల్సి వుండగా..  కరోనావైరస్ కారణంగా మనదేశంలో లాక్ డౌన్ అమలులో  ఉండటంతో వాయిదా వేయటం జరిగింది. ఇక ఎంఐ 10 మనదేశంలో లైవ్ స్ట్రీమ్ ద్వారా లాంచ్ అవుతుంది. దీనికి సంబంధించిన వివరాలు షియోమీ త్వరలో వెల్లడిస్తుంది. ఎంఐ 10, ఎంఐ 10 ప్రో స్మార్ట్ ఫోన్లు చైనాలో ఫిబ్రవరిలోనే లాంచ్ అయ్యాయి. అయితే మనదేశంలో ఈ ఫోన్లు కాస్త ఆలస్యంగా లాంచ్ అవుతున్నాయనే చెప్పాలి. ఎందుకంటే ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ వంటి యూరోప్ దేశాల్లో కూడా ఈ ఫోన్ మార్చిలోనే లాంచ్ అయింది. ఇందులో 5జీ ఫీచర్ ను కూడా షియోమీ వినియోగ దారులకు అందించనుంది.షియోమీ వైస్ ప్రెసిడెంట్, భారత మేనేజింగ్ డైరెక్టర్ మనుకుమార్ జైన్ మాట్లాడుతూ…  చైనా కంటే మనదేశంలో వీటి ధరలు కాస్త వేరుగా ఉంటాయన్నారు. ఎంఐ 10 చైనాలో 3,999 యువాన్ల(సుమారు రూ.42,400) ధరతో లాంచ్ అవటం జరిగింది. 

ఇది కూడా చదవండి: 6 నెలలు ఈఎంఐ కట్టాల్సిన అవసరం లేదు – ఎస్బీఐ

ఇక ఎంఐ 10 స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. 6.67 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ అమోఎల్ఈడీ (AMOLED) డిస్ ప్లేను ఇందులో అందించారు. దీని రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్ కాగా, టచ్ సాంప్లింగ్ రేట్ 180 హెర్ట్జ్ గా ఉంది. పంచ్ హోల్ డిజైన్ ను ఇందులో అందించారు. ఆండ్రాయిడ్ 10 ఆధారిత ఎంఐయూఐ 11 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది.

ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాల సెటప్ ను అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 108 మెగా పిక్సెల్ గా ఉంది. 13 మెగా పిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న మరో రెండు కెమెరాలను ఇందులో అందించారు. 8కే రిజల్యూషన్ వీడియోలను ఇందులో తీయవచ్చు. సెల్ఫీల కోసం ముందువైపు 20 మెగా పిక్సెల్ కెమెరాను అందించారు.

క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 865 ప్రాసెసర్ పై ఈ స్మార్ట్ ఫోన్ పనిచేయనుంది. ఎంఐ 10లో 4,780 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. ఇది 30W వైర్డ్ చార్జింగ్, 30W వైర్ లెస్ చార్జింగ్ ఫీచర్ ను సపోర్ట్ చేస్తుంది. 10W వైర్ లెస్ రివర్స్ చార్జింగ్ ఫీచర్ ను కూడా ఇందులో అందించడం విశేషం.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss