Saturday, February 27, 2021

Latest Posts

చిత్తూరు జిల్లా నుంచి 5572 మంది వలస కార్మికుల తరలింపు

వివిధ పనుల నిమిత్తం జిల్లాకు వచ్చి లాక్ డౌన్ కారణంగా జిల్లాలోనే ఉండిపోయిన ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులను జిల్లా నుండి ఇతర రాష్ట్రాలకు ప్రత్యేక శ్రామిక్ రైలు మరియు ప్రత్యేక బస్సులు ద్వారా ఇప్పటి వరకు 5572 మంది వలస కార్మికులను పంపడం జరిగిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు

వివిధ పనుల నిమిత్తం జిల్లాకు చేరుకుని లాక్ డౌన్  కారణంగా స్వస్థలాలకు వెళ్ళలేక ఇక్కడే ఉండి పోయిన వలస కూలీలు జిల్లాలో దాదాపుగా 20 వేలకు మందికి పైగానే ఉన్నట్లు తెలిపారురాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వలస కూలీల కు భోజన వసతి, బస ఏర్పా టు చేయడం జరుగు తున్న దని, దీనితోపాటుగా ప్రత్యేక బస్సులు,ప్రత్యేక శ్రామిక్ రైలు ద్వారా వారిని వారి సొంత రాష్ట్రాలకు పంపేందుకు చర్యలు తీసుకొంటున్నామని తెలిపారు

జిల్లా కేంద్రం నుండి ఇప్పటి వరకు నాలుగు ప్రత్యేక శ్రామిక్ రైలు ద్వారా బీహార్, ఉత్తర ప్రదేశ్ (తూర్పు) ఒడి స్సా,ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల కు వలస కార్మికులను పంపడం జరిగిందని, వీరిలో బీహార్- 110 మంది, ఉత్తర ప్రదేశ్ (తూర్పు)- 1301 మం ది, ఒడిసా- 1384 మంది, ఉత్తర ప్రదేశ్ -1412 మందికి కి భోజనం ఏర్పాట్లతో పాటు కోవిడ్-19 లో భాగంగా తగు పరీక్షలు నిర్వహించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ వారిని వారి స్వస్థలాలకు పంపడం జరిగిందని తెలిపారు

ఇది కూడా చదవండి: సి.ఏం అనుమతీస్తే 24 గంటల్లో సర్వీసు  

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss