Saturday, May 15, 2021

Latest Posts

విదేశాల్లో చిక్కుకున్న భారతీయుల కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం

Migrant Workers in Foreign Countries

మార్చి 22న జనతా కర్ఫ్యూ తర్వాత విమానాల రాకపోకలు ఆగిపోవడం,ఇక లాక్ డౌన్ కారణంగా విమానాలు అస్సలు కదల్లేదు. అయితే ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం చూపుతున్న నేపథ్యంలో ఇతర దేశాల్లో చిక్కుకున్న భారతీయుల విషయంలో కేంద్రం ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌లో లాక్‌డౌన్ అమలు నేపథ్యంలో విదేశీ రాకపోకలపై కేంద్రం నిషేధం విధించడంతో ఉపాధి కోసం, ఉద్యోగ నిమిత్తం ఇతర దేశాలకు వెళ్లి భారత్‌కు తిరిగి రావాలనుకుంటున్న భారతీయులకు విఘాతం ఏర్పడింది. అయితే అలాంటి వారికోసం కేంద్రం తాజాగా శుభవార్త చెప్పింది.

ఇప్పటికే దేశంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న వలస కార్మికులను స్వరాష్ట్రాలకు తరలించడానికి ప్రత్యేక రైళ్లు నడుపుతుండగా, మే 7 నుంచి విదేశాల నుంచి వచ్చే భారతీయుల కోసం విమానాలు, నౌకలు నడపనున్నట్లు కేంద్రం ప్రకటించింది. విదేశాల్లో చిక్కుకున్న భారతీయుల జాబితాను భారతీయ ఎంబసీలు, హై కమిషన్లు సిద్ధం చేస్తున్నట్లు తెలిపింది.

ఇది కూడా చదవండి: వలస కార్మికులు వర్సెస్ పోలీసులు

అయితే.. ఈ విమానాలు, నౌకల్లో రావాలనుకునే భారతీయులు రవాణా ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. అంతేకాదు, మెడికల్ స్క్రీనింగ్ నిర్వహించిన అనంతరం.. కరోనా లక్షణాలు లేనివారిని మాత్రమే ప్రయాణానికి అనుమతించనున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. అయితే.. మే 7 నుంచి దశల వారీగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి చేర్చనున్నట్లు భారత ప్రభుత్వం వెల్లడించింది.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss