migrant workers in hyderabad started moving to their hometowns
కరోన రోజు రోజుకు పెరగడంతో లాక్డౌన్ ను మే3వ తేదీ వరకు పొడిగించడంతో మళ్ళీ అన్నీ సమస్యలు మొదటకు వచ్చాయి. అందులో ముఖ్యమైనది వలస కార్మికుల సమస్య. లాక్డౌన్ పొడిగిస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించిన వెంటనే ప్రధాన రహదారుల వెంట కూలీలు కాలి నడకన ఇంటి బాట పట్టారు. హైదరాబాద్లోని ఉప్పల్ ప్రాంతం నుంచి శ్రీకాకుళం జిల్లాకు చెందిన వలస కార్మికులు పెద్ద ఎత్తున స్వస్థలాలకు బయలుదేరారు. దగ్గర దగ్గర 150 మంది వలస కార్మికులు కాలి నడకన స్వగ్రామాలకు చేరుకోవడానికి బయలుదేరారు.
వీరందరినీ హబ్సిగూడ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. అయితే అధికారులు ఎంత నచ్చజెప్పినా వారు వినిపించుకోవడం లేదు. వీరి గురించి సమాచారం అందుకున్న స్థానిక ఎమ్మెల్యే హబ్సిగూడకు చేరుకొని వలస కార్మికులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. వారిని అన్ని విధాలా ఆదుకుంటామని జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ కూడా హామీ ఇచ్చారు. గంటలో వారికి తగిన ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. నగరంలో ఇప్పటికే చాలా మంది వలస కార్మికులు ఉన్నారని వారి అందరికీ ఆశ్రయం కల్పించామని. అలాగే మీకు కూడా ఆశ్రయం కలిపిస్తామని తెలిపారు.
వలసకులీలు తమకు ప్రభుత్వం నుండి ఇప్పటివరకు ఎటువంటి సహాయం అంద లేదని. పనులు లేక ఇంటి అద్దెలు చెల్లించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గంటలో తమ సమస్య పరిష్కరిస్తామని మేయర్ బొంతు రామ్మోహన్ హామీ ఇచ్చారు. వారికి రేషన్ బియ్యం ఇస్తామని అలాగే వారు అద్దెకుంటున్న ఇంటి యజమానులతో మరియు వారు పనిచేస్తున్న కంపెనీ యాజమాన్యంతోనూ ప్రభుత్వం మాట్లాడుతుందని నచ్చజెప్పారు. వారు ఉన్న చోటే ఉండొచ్చని లేదంటే.. ప్రభుత్వం తగిన వసతి కల్పిస్తుందని హామీ ఇచ్చారు. తక్షణం వారికి తాత్కాలిక ఏర్పాట్లు చేసి ఆ తర్వాత తగిన వసతి కల్పిస్తామని తెలిపారు.