పట్టణాలలోని వలస కార్మికులు, పేదల కోసం విపత్తు నిర్వహణ నిధులు ఏర్పాటు చెయ్యడం జరిగింది. వలస కార్మికుల పునరావాసం కోసం రూ. 11 వేల కోట్లు కేటాయిస్తుంది. వలస కూలీల కనీస వేతనాన్ని రూ. 180 నుంచి రూ.202 వరకు పెంచడం జరిగింది. కాగా దేశమంతటా ఒకే విధానంలో వేతనాన్ని ఇవ్వాలని సూచించింది.
అసంఘటిత రంగంలో కార్మికులందరికి ఇక పై అపాయింట్మెంట్ లెటర్లు ఇవ్వడం జరుగుతుంది అని స్పష్టం చేశారు. కార్మికులందరికి కనీస వేతన హక్కుని కలిపించింది కేంద్ర ప్రభుత్వం. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులందరికి ఆరోగ్య పరీక్షలు చేయనున్నట్టు తెలియచేసింది. కాగా మోడి ప్రవేశపెట్టిన భారత స్వీయ ఆధారిత భారత్ ప్యాకేజ్లో రెండవ ముఖ్య ప్యాకేజ్ విభాగంలో వలస కార్ముకులకు అండగా నిలిచేలా ఆర్ధిక చేయూత ఇవ్వనున్నాటు స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: రైతులకు రైతు భరోసా ఇవ్వనున్న జగన్