Wednesday, December 1, 2021

Latest Posts

కావేరి నది బ్రిడ్జ్ పై ఆహారం కోసం ఎదురుచూస్తున్న వలస కూలీలు

Migrant workers waiting for food on Kaveri Bridge :

భారతదేశం లోక్ డౌన్ లో ఉన్న సమయంలో వలస కూలీల కష్టాలు కన్నీళ్ళు తెప్పిస్తున్నాయి. పని చేసి సంపాదించే అవకాశం లేకపోవడం వలన తమకు అన్నం పెట్టె అన్నదాతల కోసం రోడ్ల మీద ఈ వేసవి కాలంలో మండుటెండలో ఎదురుచూస్తున్న వలస కూలీలను చూస్తే కడుపు తరుక్కుపోతుంది. ఉన్నట్టుండి విరుచుకుపడ్డ కరోనా మహమ్మారి పేదల ఆకలి కేకలను సైతం లెక్కచేయ్యట్లేదు. గుప్పెడు ముద్ద కోసం బారులు తీరుతు ఎండలో వేచి చూస్తున్న వలస కూలీలు. మహా నగరాల్లో సైతం వలస కూలీల ఆకలి చావులు వినిపిస్తున్నాయి.

కిలో మీటర్ల పొడవునా సామాజిక దూరం పాటిస్తూ ఎండలో అన్నం కోసం ఎదురుచూస్తున్నారు వలస కూలీలు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో తిరుచ్చిలో ఆహారం కోసం వేలాది మంది వలస కూలీలు కావేరి నది బ్రిడ్జ్ పైన సామాజిక దూరం పాటిస్తూ తిండి కోసం ఎదురుచూస్తూ ఎవరో ఒకరు వచ్చి తమ కడుపు నింపక పోతారా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. కాగా వేలాది మంది వలస కూలీలు రహదారులపై ఎదురుచూస్తున్న ఒక వీడియో సామాజిక మాద్యమాలలో వైరల్ గా మారాయి. ప్రభుత్వాలు వెంటనే స్పందించాలని ప్రజలు, అక్కడి వలస కూలీలు కోరుతున్నారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss