Wednesday, April 21, 2021

Latest Posts

మిల్క్ మ్యాన్ ఆలోచనకి ఫిదా…

కరోనా నియంత్రణకి సామాజిక దూరం ఒక్కటే పరిష్కారం అని దానిని అందరూ ఖచ్చితంగా పాటించాలని ప్రపంచ వ్యాప్తంగా కరోనావైరస్ యొక్క వ్యాప్తిని అరికట్టడానికి లాక్ డౌన్ ని అనుసరిస్తుంది. అలాగే మనదేశం కూడా దానిని అవలంబిస్తున్న సంగతి తెలిసిందే.  ఇప్పుడిపుడే ప్రజలంతా సామజీక దూరం అనేది మనిషి రోజువారీ జీవితంలో ఒక భాగంగా అలవరుచుకుంటున్నారు. ఈ ప్రక్రియలో సామాజిక దూరాన్ని కొనసాగిస్తూ వినియోగదారులకు పాలు అందించడానికి ఒక మిల్క్ మ్యాన్ ఆలోచించిన తీరు అందరిని ఆకట్టుకుంటుంది.

ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో ఐఏఎస్‌ అధికారి నితిన్‌ సంగ్వాన్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. దాంతో అది  వైరల్ గా మారింది. సామాజిక దూరాన్ని ఖచ్చితంగా పాటించడానికి సదరు మిల్క్ మ్యాన్ బైకుకు సుమారు మీటరు పొడవుండే ఓ ప్లాస్టిక్ పైపు పెట్టి, దానికి ఒక గళాను పెట్టాడు. వినియోగదారులు గిన్నె పట్టుకుని ఆ పైపు పెద్ద  గిన్నె పెడితే అతడు ఆ గళాలో పాలు పోస్తున్నాడు. అవి నేరుగా గిన్నెలోకి వెళ్తున్నాయి. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు సదరు మిల్క్ మ్యాన్ ఆలోచనకి ఫిదా అవ్వడమే కాదు అతని ఐ‌డియకు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

Also Read:ట్రంప్ పర్సనల్ స్టాఫ్‌కు కరోనా పాజిటివ్…

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss