Wednesday, December 1, 2021

Latest Posts

శాయశక్తులా ఆదుకుంటా-మంత్రి హరీష్ రావు

Minister Harish Rao distributes masks, gloves to sanitation workers

లాక్ డౌన్ ముగిసే దాకా ఎవరూ ఇంటి నుంచి బయటకు రావద్దని, ప్రాణాలకంటే మరేం ముఖ్యం కాదని,  సామాజిక దూరం పాటించడంతో దానిని అడ్డుకోవచ్చని ఆర్ధికశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వల సూచనలు అందరూ పాటించాలి అని, లాక్ డౌన్  పొడిగింపు వుంటే అందరు సహకరించాలని, దేవుడి దయ వల్ల సిద్ధిపేటలో ఒక్క కరోనా కేసు నమోదు కాలేదని ఈ సందర్బంగా ఆయన చెప్పారు.

హాస్యనటుడు శివారెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డితో  కలిసి జిల్లా కేంద్రమౌన సిద్ధిపేట కొండ భూదేవి గార్డెన్స్‌లో లైట్‌మోటార్‌ వెహికల్స్‌, మెకానికల్‌, ఆటో అసోసియేషన్‌లకు చెందిన సంఘ సభ్యులకు బియ్యం, నిత్యావసర సరుకులు కలిగిన కిట్‌ను పంపిణీ చేశారు. ఈ సమయంలో పేదలు, కార్మికులు, రోజూ రెక్కాడితే డొక్కాడని దినసరి కార్మికులైన వారిని గురించి తన ఉడతా భక్తిగా ఆలోచన చేసి ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు మంత్రి తెలిపారు. ఇంకా ఏ అవసరమొచ్చినా తన దృష్టికి తీసుకు రావాలని, తన శాయశక్తులా ఆదుకుంటానని తెలిపారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss