Saturday, May 15, 2021

Latest Posts

తెలంగాణా వాసులకు కే.సి.ఆర్ గిఫ్ట్

తెలంగణా వాసులకు దీపావళి సందర్భంగా కేసీఆర్ గిఫ్ట్ ప్రకటించారు. కేసీఆర్ దీపావళి కానుకగా 2020-21కి ఆస్తిపన్నులో ఉపశమన కల్పించినట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. కేటీఆర్ మాట్లాడుతూ దీపావళి కానుకగా జీహెచ్ఎంసీ పరిధిలో గృహ యజమానులకు 50శాతం రాయితీ ప్రకటించారు. దిని వల్ల 15 వేల లోపు ఆస్తిపన్ను కట్టేవారికి 50 శాతం రాయితీ వర్తిస్తుందన్నారు. ఈ నిర్ణయం వల్ల 31 లక్షల 40 వేల మందికి రూ.336.48 కోట్ల మేర లబ్ధి చేకూరుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 140 పట్టణాల్లోనూ ఆస్తిపన్నులో రాయితీ కల్పిస్తాన్నట్లు మంత్రి తెలిపారు. ఇతర పట్టణాల్లో రూ.10వేల లోపు ఆస్తిపన్ను కట్టేవారికి 50 శాతం రాయితీ ఇస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే పన్ను చెల్లించిన వారికి వచ్చే ఏడాది తక్కువ వసూలు చేస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. అలాగే జీహెచ్‌ఎంసీ సఫాయి కార్మికులకు జీతాన్ని మరో రూ. 3 వేలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు  కూడా మంత్రి కేటీఆర్‌ ప్రకటన చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను కూడా కేటీఆర్‌ మీడియా ద్వారా వెల్లడించారు.

ఇది కూడా చదవండి:

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss