Minister KTR funny conversation with people about RamCharan
కరోనా మహమ్మారి వేళలో రెడ్ జోన్ లో తెలంగాణ మంత్రి కేటీఆర్ పర్యటించి,సాధక బాధకాలు తెలుసుకున్నారు. ఎవరూ బయటకు రావద్దని ,అన్నీ సరుకులు వస్తాయని ఆయన భరోసా ఇచ్చారు. ఇక సోషల్ మీడియా అందులో ముఖ్యంగా ట్విట్టర్‌ని కేటీఆర్ వాడుతున్నట్లు ఎవ్వరూ వాడటం లేదని చెప్పాలి. ఇదేదో ఆయన పర్సనల్ విషయాలకు అనుకుంటే పొరబాటే. ట్విట్టర్ ద్వారా కూడా ప్రజాసేవ చేయవచ్చనే స్ఫూర్తి రాజకీయ నాయకులందరిలో కల్గించారు. ప్రస్తుత కరోనా కాలంలో ఆయన ట్విట్టర్ యమా యాక్టివ్‌గా వాడుతున్నారు.
ఆపదలో ఉన్నానని ఎవరైనా ట్వీట్ చేస్తే చాలు వెంటనే రియాక్ట్ అవుతూ.. వారికి తగిన సహాయం చేయడానికి మార్గం చూపిస్తున్నారు తాజాగా ఆయన హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలలో కరోనాపై సమీక్షలు జరిపారు. ఇందులో భాగంగా ఓ ఇంటి వద్ద ఆయన ఆగి.. ‘‘అందరూ బాగానే ఉంటారు.. ఎవ్వరూ బయటికి వెళ్లకండి. మూతికి మాస్క్ వేసుకునే బయటికి వెళ్లాలి. మే 3 తారీఖు వరకు.. ఆ తర్వాత ఏమిటనేది తర్వాత చెబుతాం.’అని సూచించారు.
ఇక ఓ ఇంటి దగ్గర ఆగి,కొన్ని విషయాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా చమత్కారం విసిరారు. ‘పిల్లలు ఇంట్లోనుంచి కదులుతున్నారా? పోనియకండి. నీ కొడుకా..? ఏం పేరు.. అని అడుగగా.. (పిల్లాడు రామ్ చరణ్ అని సమాధానం ఇచ్చాడు ..), అవునా.. ఆ రామ్ చరణ్ తెలుసా నీకు? సినిమాల్లో రామ్ చరణ్ తెలుసా..?’’ అని సరదాగా కేటీఆర్ వారితో సంభాషించారు. ఇప్పుడీ వీడియో చూసిన మెగా ఫ్యాన్స్ యమ ఖుషీ అయిపోతున్నారు.