Thursday, December 2, 2021

Latest Posts

రేవంత్ రెడ్డి రోజుకో మాట పూటకో పార్టీ – మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

Minister vemula prashanth reddy fire on revanth reddy

టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఫైరయ్యారు. నిన్న ఇంద్రవెల్లి సభలో రేవంత్ రెడ్డి కేసీఆర్ లక్ష్యంగా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. దానికి గాను వేముల ప్రశాంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఇంద్రవెల్లిలో రేవంత్ రెడ్డి నోటి దూల తీర్చుకున్నారని, సీఎం కేసీఆర్‌ను తిట్టడం ద్వారా అయన  శునకానందం పొందారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు.  చంద్రబాబు భిక్షతోనే రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయ్యాడని, ఇప్పటికీ చంద్రబాబు కనుసన్నల్లోనే రేవంత్ రెడ్డి నడుస్తున్నారని ప్రశాంత్ రెడ్డి విమర్శించారు.

రేవంత్ రెడ్డి చరిత్ర మర్చిపోయి మాట్లాడుతున్నారని, ఆయనను చూస్తుంటే తమకు జాలి కలుగుతోందని పేర్కొన్నారు.  శవాలపై పేలాలు ఏరుకునే రేవంత్ రెడ్డి, రోజుకో మాట, పూటకో పార్టీ మార్చుతుంటాడని అందువల్ల ఆయనను  ప్రజలు ఏవిధంగా నమ్మాలని ప్రశ్నించారు. 1981 ఇందిరాగాంధీ హయాంలో ఇంద్రవెల్లిలో ఆదివాసీ బిడ్డలను వందల మందిని పిట్టలను కాల్చినట్టు కాల్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని, అలాంటిది నిన్న అదే ఇంద్రవెల్లిలో కాంగ్రెస్ సభ ఏర్పాటు చేయడం చూస్తుంటే గుండెలు మండాయని వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss