Home వైరల్ క్షుద్ర పూజల పేరుతో మైనర్ బాలికపై అత్యాచారం

క్షుద్ర పూజల పేరుతో మైనర్ బాలికపై అత్యాచారం

Minor Girl Was Raped In The Name Of Occult Pooja in Prakasam District

నల్గొండ జిల్లా అడవిదేవిపల్లి మండలం మొగిలిచర్లకు చెందిన విష్ణువర్దన్‌ అలియాస్‌ రాంబాబు అతను మంత్ర తంత్రాలతో క్షుద్ర పూజలు చేస్తుంటాడు.  అయితే అతను భార్యాభర్తల గొడవలు పరిష్కరిస్తానని,ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా తీరుస్తానని నమ్మబలికేవాడు.  ఇప్పటివరకూ అతను నమ్మి ఆ గ్రామంలో పలువురి వద్ద పూజల పేరుతో రాంబాబు సుమారు రూ.3లక్షల దాకా వసూలు చేశాడని వారు  ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే క్రమంలో ప్రకాశం జిల్లా రుద్రసముద్రంకు చెందిన రామాంజితో ఇతనకు  పరిచయం ఏర్పడింది. రాంబాబు ఎక్కడికెళ్లినా రామాంజి కూడా అతనితో పాటే వెళ్లేవాడు అదే అదునుగా  ఆ గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి ఇంట్లో సమస్యలు ఉన్నాయి అని వాటిని  తొలగిస్తానని నమ్మించి రాంబాబు పూజలు చేశాడు. ఇటీవల రామాంజి అన్న బాలరాజు ఇంట్లో లంకె బిందెల కోసం రాంబాబు పూజలు చేశాడు .

అయితే పూజలు  చేసేందుకు అమ్మాయి కావాలని అలా అయితేనే లంకె బిందెలు వస్తాని చెప్పాడు అలా  చెప్పడంతో ఆయన తన కూతురిని ఇంట్లోకి పంపాడు. ఈ సమయంలో రాంబాబు ఆ మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. క్షుద్రపూజల విషయం  తెలుసుకున్న  గ్రామస్తుల అంత  బాలరాజు ఇంటికెళ్లి నిలదీయాలనుకున్నారు.  అయితే ఇంతలో విషయం తెలుసుకున్న రాంబాబు బాలికతో బైక్‌పై పరారయ్యేందుకు ప్రయత్నించాడు. అయితే గ్రామస్తులు మార్గమధ్యలోనే వారిని అడ్డుకుని చితకబాధి. రాంబాబును చెట్టుకు కట్టేసి  తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న  పోలీసులు  రాంబాబును అదుపులోకి తీసుకుని ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.

ఇది కూడా చదవండి: హైదరాబాద్ లో దారుణం స్నేహితుడి ఆచూకీ చెప్పలేదని హత్య

Exit mobile version