Thursday, December 2, 2021

Latest Posts

నేడు ప్రారంభం కానున్న ప్రజల వద్దకే వైద్యం

MK Stalin To Launch Doorstep Health Care Scheme

తమిళనాడు ప్రభుత్వం  ‘ప్రజల వద్దకే వైద్యం’ (Makkalai Thedi Maruthuvam) పేరుతో కొత్త పథకాన్ని నేడు ప్రారంబించనుంది. ఈ పథకాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి డిఎంకే స్టాలిన్‌ గురువారం ఉదయం కృష్ణగిరి జిల్లా హోసూరు సమీపంలోని సూళగిరి గ్రామంలో ప్రారంభించనున్నారు.  రాష్ట్రంలో మధుమేహం, రక్తపోటు వంటి దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారికి ఆరోగ్యశాఖ సిబ్బంది ప్రతి ఇంటికీ వెళ్ళి వారి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకుని, రోగాలను గుర్తించి అవసరమైన చికిత్స చేసి ఉచితంగా మందులు పంపిణీ చేస్తారు.

కరోనా సోకుతుందని బయంతో మధుమేహం, రక్తపోటు వంటి దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న రోగులు ఆస్పత్రులకు వెళ్లలేకపోతున్నారని, తద్వారా రోగాలు పెరుగుతున్నాయని ప్రభుత్వ అధ్యయనంలో తేలడంతో వారిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం వారి ఇళ్ళ వద్దే ఉచితంగా మందులు పంపిణీ చేయడంతో పాటు అవసరమైనవారికి మినీ యంత్రాలతో డయాలసిస్‌ కూడా చేయా లని నిర్ణయించి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ప్రభుత్వం.

ఇది కూడా చదవండి:  

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss