MLA Ganta Srinivasa Rao Resigned
టిడిపి సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి మరియు వైజాగ్ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను ఎపి అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు పంపారు. గంటా చాలా కాలం నుండి టిడిపిలో కీలకవ్యక్తిగా ఉన్నారు. అతను వైయస్ఆర్సిపి పార్టీలో చేరుతారని పుకార్లు వచ్చినప్పటికి వాటిని అతను ఖండించారు.
తాజాగా గంటా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణకు నిరసనగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు గంటా తెలిపారు. రాష్ట్రంలోని ఇతర నాయకులు కూడా పార్టీలతో సంబంధం లేకుండా దీనికి మద్దతు ఇవ్వాలని గంటా కోరారు. గంటా ఆకస్మిక రాజీనామాతో టిడిపి చీఫ్, రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు కూడా అవాక్కయ్యారు. ఇప్పుడు, అందరి దృష్టి గంటా తదుపరి ఏం చేస్తారు అనే దాని పైనే చర్చ నడుస్తుంది.
ఇవి కూడా చదవండి: