రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ పై మరో సారి ఫైర్ అయ్యారు నగరి ఎంఎల్ఏ రోజా. ఇప్పుడు నిమ్మగడ్డ రమేశ్ పై ఆమె చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. నిమ్మగడ్డకు చిన్న మెదడు చితికిపోయినట్టుందన్నారు. తనకు కావాల్సిన అధికారుల్ని నియమించుకున్న తర్వాత కూడా ఏకగ్రీవాల్ని ఆపటం చూస్తే.. ఆయన మీద ఆయనకే నమ్మకం లేకుండా పోయిందా? అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాల్సిన అవసరం ఉందని.. అలా చేయకుండా ఉండటం సరికాదన్నారు.
ఏకగ్రీవాలు ఎక్కువగా ఉన్న గుంటూరు.. చిత్తూరు జిల్లాల ఫలితాలు ప్రకటించొద్దని అక్కడ అన్ని ఫిర్యాదులు పూర్తయ్యాకే ప్రకటించాలని నిమ్మగడ్డ ఆ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. దీనితో వైసీపి నాయకులు తమ ఆగ్రహాన్ని వెళ్ళగక్కారు. ముఖ్యంగా ఎంఎల్ఏ రోజా ఒక అడుగు ముందుకేసి.. నిమ్మగడ్డపై ఘాటు విమర్శల్ని సంధించారు.
ఏకగ్రీవాలు ఎక్కువగా ఉన్న ప్రకటించిన చోట లోపాలు ఉన్నట్లు తేలితే.. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని నిమ్మగడ్డ వార్నింగ్ ఇవ్వటం తెలిసిందే. ఇదే క్రమంలోతాజాగా ఎక్కువ ఏకగ్రీవాలు నమోదైన చిత్తూరు జిల్లా ఫలితాల్ని ప్రకటించకుండా నిలిపివేయాలని నిమ్మగడ్డ ఆదేశించటంతో రోజా బరస్ట్ అయ్యారు. మరి.. ఈ తరహా విమర్శపై నిమ్మగడ్డ ఎలా రియాక్టు అవుతారో చూడాలి
ఇవి కూడా చదవండి: