Sunday, June 20, 2021

Latest Posts

గర్భిణీకి సాయం చేసిన ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha Help Pregnant Lady

గర్భిణీ స్త్రీకి తెలంగాణ సి‌ఎం కె చంద్రశేఖర్ రావు కుమార్తె మరియు శాసనమండలి చైర్మన్ కె కవిత చేసిన సాయం ఇప్పుడు వైరల్ గా మారింది. ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న 23 ఏళ్ల గర్భిణీ మహిళ జ్యోతిని సకాలంలో ఆదుకున్నారు కవిత.

మే 22న, కవిత ట్విట్టర్లో ఒక ఎస్ఓఎస్ అభ్యర్థన పై స్పందించి, డెలివరీకి ఇబ్బందులు ఎదుర్కొంటున్న జ్యోతి కేసును చేపట్టింది. ఆమె భర్త రాజు నాయక్, కోస్గికి చెందిన క్యాబ్ డ్రైవర్. లాక్ డౌన్ కావడంతో ఆయన వైద్య ఖర్చులను తీర్చడం కోసం ఇబ్బంది పడుతున్నాడు. దీనితో డెలివరీ ఖర్చులను చెల్లించడానికి క్రౌడ్ ఫండింగ్ ప్రచారాన్ని ప్రారంభించాడు.

ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ కవిత, వ్యక్తిగతంగా జ్యోతికి సహాయం చేశారు. కవిత ఆమెను ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి, కోవిడ్ -19 మహమ్మారి సమయంలో జ్యోతి మరియు బిడ్డ ఇద్దరూ సురక్షితంగా ఉండేలా చూడాలని అన్ని వైద్య ఖర్చులను తాను భరిస్తానని చెప్పారు.

ఈ సాయంతో సోమవారం, జ్యోతి ఒక మగ బిడ్డకి జన్మనిచ్చింది. తల్లి మరియు కొడుకు ఇద్దరూ క్షేమంగానే ఉన్నారు. కోస్గికి చెందిన కుటుంబం ఎమ్మెల్సీ సహాయంతో మేము చాలా ఋణపడి ఉంటామని తెలిపారు. కవిత చేసిన సహాయంతో అతని భర్త ఇప్పటి నుండి గర్భిణీ స్త్రీలకు ఫ్రీగా క్యాబ్ రైడ్‌లు ఇస్తానని తెలిపాడు.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss