Monday, May 10, 2021

Latest Posts

మూడు రాజధానులకు కేంద్ర మాజీ మంత్రి కితాబు

ఏపీలో ఎక్కడ చూసినా రాజధాని అమరావతి,మూడు రాజధానుల వ్యవహారం,మండలి ఉనికి ఇలా వీటిపైనే చర్చ నడుస్తోంది. పార్టీలకతీతంగా ఎవరి అభిప్రాయం వాళ్ళు చెబుతూ మూడు రాజాధానులకు మద్దితిచ్చేవాళ్ళు ఇస్తున్నారు. వ్యతిరేకించేవాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. కులాలు,ప్రాంతాల వారీగా కూడా విడిపోతున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి ఎం ఎం పల్లం రాజు కూడా మూడు రాజధానుల ఫార్ములాకు కితాబిచ్చారు. తిరుపతిలో ఆయన మీడియాతో ముచ్చటిస్తూ, అమరావతి చంద్రబాబు నాయుడు చేసిన రాజకీయ తప్పిదాల్లో అమరావతి అతి పెద్ద తప్పిదంగా వ్యాఖ్యానించారు. విశాఖను ఒక రాజధానిగా ప్రకటించడాన్ని పల్లంరాజు స్వాగతించారు.

తూర్పు గోదావరి జిల్లా కాకినాడ పార్లమెంట్ కి గతంలో ఎంపీగా నిధ్యం వహించిన పల్లంరాజు ఏపీలో పాలనకు విశాఖ అత్యంత అనువైన నగరం గా అభిప్రాయపడ్డారు.
వాతావరణం రీత్యా విశాఖ రాజధానిగా అత్యంత సానుకూల నగరం అని అన్నారు. శివరామకృష్ణన్ కమిటీ నివేదికను తుంగలో తొక్కారని చంద్రబాబును విమర్శించారు పల్లంరాజు. మూడు రాజధానుల విషయంలో కొంతమంది కాంగ్రెస్ నేతలు పెదవి విరుపులు చేస్తున్న సంగతి తెలిసిందే.

అయితే డాక్టర్ ఎన్ తులసిరెడ్డి వంటి వాళ్లు మూడు రాజధానుల ఫార్ములాను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. అయితే కేంద్ర మాజీ మంత్రి అయిన పల్లం రాజు మాత్రం జగన్ నిర్ణయాన్ని సమర్థించడం విశేషం. పల్లంరాజు తండ్రి ఎం ఎస్ సంజీవరావు మూడుసార్లు కాకినాడ పార్లమెంట్ నుంచి ఎన్నికై,కేంద్రాల్లో ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రిగా సేవలందించారు. అలాగే పల్లంరాజు తాత పేరు కూడా పల్లంరాజే. ఆయనే ఆరోజుల్లో కాంగ్రెస్ లో కీలక పదవులు నిర్వహించారు

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss