Tuesday, May 18, 2021

Latest Posts

పశ్చిమ బెంగాల్ లో ఏరియల్ సర్వే చేయనున్న ప్రధాని మోడి

అంఫాన్ తుఫాన్ కు గడగడ వనికిన ఆంధ్రప్రదేశ్ తరువాత ఈ భీబత్సం పశ్చిమ బెంగాల్ ను తాకింది. తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడ సముద్ర తీరాన హడావడి చేసిన అంఫాన్ తరువాత పశ్చిమ బెంగాల్ ను మాత్రం గట్టి దెబ్బ తీసింది. ఈ రాష్ట్రంలో తూఫాన్ భీబత్సానికి కోల్ కత్తా బెంబేలెత్తింది. అధిక ఆస్థి నష్టం జరిగిందని ప్రభుత్వం తెలియచేసింది. ఈ తూఫాన్ భీబత్సానికి వేలాది మంది నిరాశ్రయులు కాగా 72 మంది మృతి చెందారు.

రెండు లక్షల పరిహారాన్ని మృతుల కుటుంబాలకు ప్రకటించింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. కాగా ఈరోజు ప్రధాని మోది ఈ ప్రాంతంలో ఏరియల్ సెర్వే చేయనున్నారు. “అంఫాన్ తుఫాను వల్ల సంభవించిన వినాశనం తెలుసుకున్నాను. ఈ సవాలు సమయంలో దేశం మొత్తం పశ్చిమ బెంగాల్‌కు సంఘీభావంగా నిలుస్తుంది. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం ప్రార్థిస్తున్నారు. సాధారణ స్థితిని నిర్ధారించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.” అని నరేంద్ర మోడి ట్వీట్ చేశారు.

ఇది కూడా చదవండి: 

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss