Tuesday, April 13, 2021

Latest Posts

ట్రంప్‌–మోదీ రోడ్‌షో కి విస్తృత ఏర్పాట్లు

ఈ నెల 24, 25 తేదీల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్  భారత్‌లో పర్యటించనున్న నేపథ్యంలో  చురుగ్గా ఏర్పాట్లు  సాగుతున్నాయి. అదిరిపోయే రీతిలో స్వాగతం పలకడానికి కసరత్తు చేస్తున్నారు.  ముఖ్యంగా ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీలు కలసి అహ్మదాబాద్‌లో చేయనున్న రోడ్‌షోకు ప దాదాపు 22 కిలోమీటర్ల పొడవున జరగనుంది. దీనికి  50 వేల మంది ప్రజలు దీనికి హాజరుకానున్నారని అహ్మదాబాద్‌ మేయర్‌ బిజాల్‌ పటేల్‌ చెప్పారు. ఈ రోడ్‌షో ద్వారా ట్రంప్‌–మోదీలు  మహాత్మాగాంధీకి  సంబంధాలు ఉన్న   సబర్మతీ ఆశ్రమం చేరుకుంటారు.  అనంతరం ఇద్దరూ కలసి మొతెరాలో నిర్మించిన క్రికెట్‌ స్టేడియాన్ని చేరుకోనున్నారు.

22 కిలోమీటర్ల పొడవున ప్రజలు నిలబడే పెద్ద రోడ్‌షో ఇదే కావచ్చని బిజాల్‌ పటేల్‌ చెప్పారు. రోడ్‌షోలో వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు తమ సంప్రదాయ ఆహార్యంలో కనిపిస్తారని చెప్పారు. మోదీ–ట్రంప్‌లు కలసి మొతెరాలో బహిరంగ సభలో పాల్గొంటారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత దిగ్గజ కంపెనీల సీఈఓలతో భేటీ కానున్నారు. ఇరు దేశాల వాణిజ్య బంధం మరింత బలపడటం కోసం ఫిబ్రవరి 25న ఢిల్లీలో ఆయన కార్పొరేట్‌ ప్రముఖులతో రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పాల్గొంటారు.

ట్రంప్ ని  కలిసేందుకు సిద్ధంగా ఉన్న దిగ్గజ సీఈఓల జాబితాలను భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయానికి పంపిందని విశ్వసనీయ వర్గాల బోగట్టా. ట్రంప్‌ను కలవనున్న ప్రముఖుల్లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) అధిపతి ముకేశ్‌ అంబానీ, భారతీ ఎయిర్‌టెల్‌ అధినేత సునీల్‌ భారతీ మిట్టల్, టాటా సన్స్‌ చైర్మన్‌ ఎన్‌ చంద్రశేఖరన్, మహీంద్రా గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా, ఎల్‌అండ్‌టీ చైర్మన్‌ ఏ.ఎం నాయక్, బయోకాన్‌ సీఎండీ కిరణ్‌ మజుందార్‌ షా ఉన్నారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss