Monday, May 10, 2021

Latest Posts

పాకిస్థాన్‌ విమాన ఘటనపై ప్రధాని దిగ్భ్రాంతి

పాకిస్థాన్‌లో కరాచీలోని జిన్నా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ సమీపంలో పాక్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం కుప్పకూలిపోవడంతో మొత్తం 107 మంది ప్రాణాలు కోల్పోయారు.  లాహోర్‌ నుంచి కరాచీకి వెళ్తున్న ఏ-320 విమానంలో 91 మంది ప్రయాణికులు, ఎనిమిది మంది సిబ్బంది ఉన్నట్టుగా తెలుస్తుండగా ఎయిర్‌పోర్ట్‌కు 4 కిలోమీటర్ల దూరంలోని ఓ మోడల్‌ కాలనీ దగ్గర ఈ ప్రమాదం జరగడంతో మరి కొంత మండి చని పోయినట్లు పాకిస్థాన్‌ ఎయిర్‌ పోర్టు అథారిటీ ప్రకటించింది.

ఇక, పాకిస్థాన్‌ విమాన ప్రమాద ఘటనపై భారత ప్రధాని నరేంద్రమోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఈ ప్రమాదం చాలా దురదృష్టకారం, ప్రమాదంలో మృతిచెందినవారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని  ట్విట్టర్ ద్వారా తెలిపారు.

 

ఇది కూడా చదవండి:  

  

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss