Monday, April 19, 2021

Latest Posts

సి‌ఎంలతో వీడియో కాన్ఫరెన్స్ లో మోడీ కీలక వ్యాఖ్యలు

కరోనా కట్టడి, లాక్‌డౌన్‌పై భవిష్యత్ కార్యాచరణ, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడమే లక్ష్యంగా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్రమోదీ వీడియో కాన్ఫరెన్స్‌ జరిగింది. ప్రస్తుత పరిస్థితుల్లో ముందుకు సాగాల్సిన తీరు, ఎదుర్కొంటున్న సవాళ్లకు సంబంధించి సమతుల వ్యూహాన్ని రూపొందించుకోవాల్సిన అవసరం ఉందని ప్రధాని ఉద్ఘాటించారు. ముఖ్యమంత్రులు అందించే సూచనల ఆధారంగానే దేశం ఏ దిశలో వెళ్లాలో తాము నిర్ణయించగలుగుతామని అన్నారు.

కరోనా మహ్మమారి నుంచి భారత్‌ తనను తాను విజయవంతంగా రక్షించుకుందని యావత్‌ ప్రపంచం భావిస్తోందన్న ప్రధాని.. ఈ అంశంలో రాష్ట్రాలే కీలక పాత్ర పోషించాయని కొనియాడారు. ఎక్కడైతే భౌతిక దూరం నియమాలు పాటించలేదో, ఎక్కడైతే లాక్ డౌన్ సరిగా అమలు కాలేదో, ఆయా చోట్ల మనకు సమస్యలు పెరిగాయని ప్రధాని అన్నారు. లాక్‌డౌన్‌ నుంచి గ్రామీణ ప్రాంతాల్లో మినహాయింపులిచ్చినా కరోనా అక్కడ వ్యాపించకుండా చూడటం మన ముందున్న అతిపెద్ద సవాలని ప్రధాని వ్యాఖ్యానించారు. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని కార్యాచరణ రూపొందించి ఇలాంటి తప్పులు పునరావృతం కాకూడదని మోడి సూచించారు.

ఇది కూడా చదవండి: లాక్ డౌన్ ను పొడిగించమని కోరిన సి‌ఎంలు

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss