Monday, May 10, 2021

Latest Posts

ప్రాపర్టీ కార్డు పంపిణీని మొదలు పెట్టిన మోడి

గ్రామీణ ప్రజలకు సాధికారత కల్పించడమే లక్ష్యంగా తీసుకొచ్చిన స్వామిత్వ పథకంలో భాగంగా లబ్ధిదారులకు ప్రాపర్టీ కార్డులను అందజేసే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు ప్రధాని నరేంద్ర మోదీ. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆరు రాష్ట్రాల్లో కార్డుల పంపిణీ మొదలుపెట్టారు. అనంతరం లబ్ధిదారులతో ముచ్చటించారు.దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తోన్న కోట్లాది మంది పౌరులకు ఈ పథకం ద్వారా సాధికారత కల్పించనుంది కేంద్రం. గ్రామస్థులు వారి భూములను ఆర్థిక ఆస్తులుగా పరిగణించి రుణాలు, ఇతర ప్రయోజనాలు పొందేందుకు మార్గం సుగమం కానుంది.

తొలుత యూపీ, హరియాణా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, కర్ణాటక రాష్ట్రాల్లోని దాదాపు లక్షమంది గ్రామీణ ప్రజలకు ప్రాపర్టీ కార్డులను పంపిణీ చేయనున్నారు. ఈ ప్రాపర్టీ కార్డుల వల్ల బ్యాంకుల్లో రుణాలు పొందడంతోపాటు ఇతర ఆర్థిక ప్రయోజనాలు కలగనున్నాయి. ప్రస్తుతం ఈ పథకం ద్వారా ఆరు రాష్ట్రాల్లోని 763 గ్రామాలకు చెందిన ప్రజలు లబ్ధి పొందనున్నారు. దాదాపు లక్షమంది లబ్దిదారుల మొబైల్‌ ఫోన్లకు ఎస్‌ఎంఎస్‌ ద్వారా లింక్‌ పంపించినట్లు ప్రధాని కార్యాలయం పేర్కొంది.

ఇది కూడా చదవండి:  

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss