Tuesday, March 9, 2021

Latest Posts

కరోనాపై ప్రసంగానికి ప్రధాని సన్నద్ధం

modi mann ki baat speech on coronavirus today:

చైనాలోని వుహాన్‌లో ఉద్భవించిన కరోనా (కొవిడ్-19) వైరస్, ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఈ మహమ్మారి క్రమంగా ప్రపంచ దేశాలకు పాకింది. ఇక కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతినుద్దేశించి వివరించనున్నారు. గురువారం రాత్రి 8 గంటలకు ఆయన ప్రసంగం ప్రారంభమౌతుంది. తన ప్రసంగం గురించి మోదీ ట్విటర్ ద్వారా వెల్లడించారు. కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుతో పాటు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, పారా మెడికల్ స్టాఫ్, సైనిక బలగాలు చేస్తున్న సేవలను మోదీ కొనియాడారు.

మరోవైపు కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలపై మోదీ అధికారులతో కీలక సమావేశం నిర్వహించారు. కాగా భారత్‌లో కూడా కరోనా వైరస్ బారిన పడిన వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. దేశ వ్యాప్తంగా సుమారు 160 మంది కరోనా బారినపడ్డారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలన్ని అప్రమత్త మయ్యాయి. పాఠశాలలు, బహిరంగ సభలు, వివాహ వేడుకలపై ప్రభుత్వాలు ఇప్పటికే ఆంక్షలు విధించాయి. తాజాగా రాజస్థాన్ ప్రభుత్వం ఆ రాష్ట్రంలో 144 సెక్షన్ విధించింది. రాజస్థాన్‌లో బుధవారం మూడు కరోనా కేసులు నమోదయ్యాయి.

కాగా కరోనా వైరస్‌ సోకుతుందన్న భయంతో మాంసాహారులంతా శాకాహారులుగా మారిపోతున్నారు. చైనాలో కరోనా వైరస్‌ ప్రబలటానికి అక్కడి ప్రజలు మాంసాహారం తినడం లేదని తెలియటంతో తమిళనాడు రాష్ట్రంలోని ప్రజలు క్రమంగా మాంసాహారానికి గుడ్‌బై చెబుతున్నారు. నిల్వ ఉంచిన మాంసం ద్వారా కరోనా వ్యాపిస్తుందని వార్తలు రావడంతో మాంసాహారానికి స్వస్తిపలుకుతున్నారు. దీంతో ప్రస్తుతం చికెన్‌, కోడి గ్రుడ్ల ధరలు బాగా తగ్గిపోయాయి. రాష్ట్రమంతటా కోళ్ళ ఫారాల్లో 19 కోట్లకు పైగా కోడిగుడ్లు నిల్వలున్నాయి. శాకాహారులు పెరగడంతో కాయగూరల దుకాణాలలో రద్దీ అధికమైంది.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss