Thursday, May 13, 2021

Latest Posts

కరోనాపై ప్రధాని మోదీ షాకింగ్ కామెంట్స్

modi shocking comments on coronavirus in twitter:

ప్రపంచాన్ని కరోనా వైరస్ దారుణంగా వణికిస్తోంది. ఎప్పుడు ఏమౌతుందోనని అందరూ భయపడి పోతున్నారు. అయితే భారతదేశంలో ప్రధాని నరేంద్రమోదీ స్పందిస్తూ, కరోనావైరస్ (కోవిడ్-19)పై ఎలాంటి భయాందోళనలు అవసరం లేదని చెప్పారు. కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పనిచేస్తున్నాయని అన్నారు. దేశంలో రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కేసులతో తీవ్ర భయాందోళనలు వ్యక్తమతుండడంతో ప్రధాని మోదీ ఇవాళ ట్విటర్ వేదికగా స్పందించారు.

modi twitt on corona virus

‘‘ఎలాంటి భయాందోళన అవసరం లేదు. అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. స్వీయ రక్షణపై కొంచెం శ్రద్ధ వహించడం ముఖ్యం. అందరూ కనీస రక్షణ చర్యలు తీసుకోవాలి…’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై ఓ గ్రాఫిక్‌ను కూడా ప్రధాని షేర్ చేసుకున్నారు. కాగా దేశంలో కరోనా వైరస్ పరిస్థితిపై ప్రధాని ఇవాళ ఢిల్లీలో విస్తృత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
అనంతరం ప్రధాని మోదీ స్పందిస్తూ.. ‘‘కోవిడ్-19 నోవెల్ కరోనా వైరస్‌పై సమీక్షా సమావేశం జరిగింది. విదేశాల నుంచి వచ్చిన వారిని స్క్రీనింగ్ నిర్వహించడం మొదలు బాధితులకు అందించాల్సిన చికిత్స వరకు అన్ని అంశాలపైనా పలు మంత్రిత్వ శాఖలు, రాష్ట్రాలు కలిసికట్టుగా పనిచేస్తున్నాయి…’’ అని వెల్లడించారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss