దివంగత ప్రధాని రాజీవ్ గాంధీకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. ఇవాళ రాజీవ్ వర్థంతి సందర్శంగా ప్రధాని మోదీ ట్విటర్ వేదికగా ఆయనను స్మరించుకున్నారు. ‘‘దివంగత ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ వర్థంతి సందర్శంగా ఆయనకు నివాళి..’’ అని ఆయన ట్వీట్ చేశారు. 1991లో సరిగ్గా ఇదే రోజు నాటి ప్రధాని రాజీవ్ గాంధీ దారుణ హత్యకు గురయ్యారు.
లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా తమిళనాడులోని కంచిజిల్లా శ్రీపెరుంబుదూర్‌లో రాత్రి వేళ ఆయన ఎన్నికల ర్యాలీలో ఉండగా ఆత్మాహుతి దాడి జరిగింది. మాజీ ప్రధాని, మాతృమూర్తి ఇందిరా గాంధీ హత్యానంతరం 40 ఏళ్లకే ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రాజీవ్.. అతి పిన్నవయస్కుడైన భారత ప్రధానిగా గుర్తింపు పొందారు.
ఇది కూడా చదవండి: